Social 1080×1350 • Multi-page
18-03-2026 BREAKING NEWS 08:09 PM
swarnodayam.com
Telugu Daily News

రైతుబంధు తొలి లబ్ధిదారుడు ఇక లేడు.. – వృద్ధాప్యంతో మూగల సంజీవరెడ్డి(95) మృతి

రైతుబంధు తొలి లబ్ధిదారుడు ఇక లేడు.. – వృద్ధాప్యంతో మూగల సంజీవరెడ్డి(95) మృతి
IMG_20260318_200553

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో పాల్గొని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకంలో తొలి లబ్ధిదారుడిగా కెసిఆర్ చేతుల మీదుగా చెక్కు అందుకున్న కరీంనగర్ జిల్లా హుజూరబాద్ మండలం ధర్మరాజు పల్లి గ్రామానికి చెందిన రైతు బందు ప్రధమ లబ్ధిదారుడు మూగల సంజీవరెడ్డి(95) వృద్ధాప్యంతో బుధవారం తుది శ్వాస (మృతి) విడిచారు. ధర్మరాజు పల్లి గ్రామానికి ప్రథమ సర్పంచిగా 1981 నుండి 87 వరకు విశేష సేవలందించారు. అంతేగాక 1999లో కరీంనగర్ జిల్లాలోనే ఒక నాణ్యమైన విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని ‘ధర్మరాజుపల్లి ధాన్య విత్తన కేంద్రం’ పరస్పర రైతుల సహకార సంఘాన్ని 1999లో వ్యవస్థాపించి జిల్లాలోని గాక ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. 2018 మే 10న అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందజేసేందుకు హుజురాబాద్ మండలం శాలపల్లి ఇంద్రనగర్ కేంద్రంగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించగా తొలి రైతుగా ప్రథమ చెక్కు అందుకొని జాతీయ, అంతర్జాతీయ మీడియాను సంజీవరెడ్డి ఆకర్షించారు. గత కొన్నాళ్లుగా సంజీవరెడ్డి వృద్ధాప్యము, అనారోగ్యంకు గురి కావడంతో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉండగా గతంలోనే భార్య, ఓ కూతురు చనిపోయారు. సంజీవరెడ్డి మృతి పట్ల గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, రెడ్డి సంఘం రాష్ట్ర నేత పో రెడ్డి శాంతన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

1918 మే 10వ తేదీన రైతుబంధు తొలి పాస్బుక్ అందుకుంటున్న దివంగత మూగల సంజీవరెడ్డి(ఫైల్ ఫోటో)

మూగల సంజీవరెడ్డి 95 (ఫైల్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!