Social 1080×1350 • Multi-page
18-03-2026 BREAKING NEWS 08:32 PM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి కోమటిరెడ్డిపై జాజుల వ్యాఖ్యలు గర్హనీయం. – ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి

మంత్రి కోమటిరెడ్డిపై జాజుల వ్యాఖ్యలు గర్హనీయం. – ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి
IMG-20260318-WA0083

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
మంత్రి కోమటి రెడ్డినీ మంత్రి వర్గం నుంచి తప్పించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరడం విడ్డూరంగా ఉందని, జాజుల అహంకార కుల దోరణి వైఖరిని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడీ రామారావు దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాల్లో ఎందరో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆర్థిక సహాయం కింద కోట్లాది రూపాయలు సొంతంగా అందించిన ఘనత కోమటిరెడ్డి దని..తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని వదులుకున్న నిస్వార్థ ప్రజా సేవకుడు కోమటిరెడ్డి అని అన్నారు.
సీనియర్ నాయకుడైన జగ్గారెడ్డికి సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కోమటి అన్నారని దానికి బదులుగా ఎంఎల్ సి గా ఉన్న ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను మంత్రి వర్గంలోకి తీసుకు రావాలన్నదే కోమటిరెడ్డి అబిమతంగా ఉందని రామారావు అన్నారు. అటువంటి వ్యక్తి పై కులం కార్డు తో రెచ్చిపోవడం, ప్రతి దానికి కులం కార్డు అడ్డుపెట్టుకొని చిలువలు పలువలుగా ప్రతి సారి ఓసి లను కించపరిచే విధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ అనుచిత వైఖరిని ఓసి ఐకాస తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని పోలాడీ రామారావు పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అంటే అన్నివర్గాల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారని వారంటే మా అందరికీ అభిమానం అని అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలని కోమటిరెడ్డి మొదట ప్రతిపాదించిన విషయం విదితమే! దానికి ఏదో జరిగిపోయినట్లుగా నిరాధార నిందారోపణలు చేసిన జాజుల తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పోలాడి రామారావు హితవు పలికారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!