Social 1080×1350 • Multi-page
18-03-2026 BREAKING NEWS 09:35 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పట్టణంలో ఘనంగా దావత్ – ఎ – ఇఫ్తార్ విందు.. -మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు.. – చైర్ పర్సన్ సుహాసిని.

హుజురాబాద్ పట్టణంలో ఘనంగా దావత్ – ఎ – ఇఫ్తార్ విందు.. -మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు.. – చైర్ పర్సన్ సుహాసిని.
IMG-20260318-WA0102

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన దావత్ – ఎ – ఇఫ్తార్ విందులో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

“ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం అని అన్నారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత” అని పేర్కొన్నారు.

హుజురాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ‘దావత్-ఏ-ఇఫ్తార్’ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, గంగా జమున తెహజీబ్‌కు నిలయమైన హుజురాబాద్ పట్టణంలో అందరం సోదరభావంతో మెలిగి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిద్దాం అన్నారు. మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం అన్నారు. అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ ఇఫ్తార్ విందులో జామే మస్జిద్ ఈద్గా అండ్ ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మస్జిద్ – ఎ – బషీర్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్, ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు మహమ్మద్ కాలిక్ హుస్సేన్, ఎండి సమ్రీన్ గఫార్, మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు ముస్లిం మతపెద్దలు ముఫ్తీ అమీర్ బాబా, హఫీజ్ ఇమ్రాన్ బేగ్, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్, పాలకవర్గ సభ్యులు, ముస్లిం మైనార్టీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!