Social 1080×1350 • Multi-page
19-03-2026 BREAKING NEWS 09:38 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు.. – భక్తిశ్రద్ధలతో ఆలపించిన పంచాంగ శ్రవణాలు.

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు.. – భక్తిశ్రద్ధలతో ఆలపించిన పంచాంగ శ్రవణాలు.
IMG_20260319_212312

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలుగు నూతన సంవత్సరాదిగా జరుపుకునే ఉగాది పండుగ పర్వదినాన్ని గురువారం హుజూరాబాద్ లో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రజలు తమ ఇంటిని శుభ్రం చేసుకుని మామిడాకులు కట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకున్నారు. పండుగను పురస్కరించుకొని ఉగాది పచ్చడి, భక్షాలు ఇతర పిండి వంటలు చేసుకుని ఇంట్లో భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. సాయంత్రం హుజురాబాద్ పట్టణంలోని రామాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, అయ్యప్ప దేవాలయం, హనుమాన్ దేవాలయం, కెసి క్యాంపులోని వెంకటేశ్వర స్వామి ఆలయం లలో వేద పండితులు భాస్కర్ శర్మ, శ్రీధరాచార్యులు కిరణ్ కుమార్ ఆచార్యులు, లలిత్ ఆచార్యులు, శ్రీకాంత్ శర్మ, రాహులాచర్యులు, నందయ్య గారు, తిరుమల ఆచార్యులు, ప్రదీప్, విశ్వనాధ్ శర్మ, పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీ పరాభవ సంవత్సరంలోని వివిధ అంశాలను ప్రస్తావించి, రాశుల ఫలాలను వివరించారు. భక్తులకు నామార్చన, రాశి ఫలాల ఫలితాలను వివరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

శివ రామాలయం వద్ద పంచాంగ శ్రవణం గావిస్తున్న పురోహితులు..

శ్రీ సంతోషిమాత సహిత అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద పంచాంగ శ్రవణము గావిస్తున్న పురోహితులు.. ఆలకిస్తున్న భక్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు..

కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద పంచాంగ శ్రవణం గావిస్తున్న వేద పండితులు..

ఇంటి వద్ద ఉగాది పచ్చడి చేసుకున్న భక్తులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!