Social 1080×1350 • Multi-page
21-03-2026 BREAKING NEWS 12:42 AM
swarnodayam.com
Telugu Daily News

బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలు

బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలు
IMG_20260321_003909

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కందుగుల గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ ఏరియా ఇంచార్జ్ ఖాజాబీ పిలుపునిచ్చారు. మండలంలోని కందుగుల జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో నీటి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి నిల్వలను పెంచుకోవాలని, నీటిని వృధా చేయకూడదని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్, ఉప సర్పంచ్ మండ సతీష్, వార్డు సభ్యులు అరుణ, విజయ్, గ్రామ పెద్దలు మోడ్తల సాంబయ్య, స్కూల్ హెచ్ఎం సంజీవరెడ్డి, ఇన్చార్జి మేడం ఏ మమత, స్కూల్ ఉపాధ్యాయులు మరియు బాలవికాస కోఆర్డినేటర్స్ రజిత, హైమావతి, కళ్యాణి, మరియు మహిళలు స్కూల్ పిల్లలు నజీమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని అలాగే గ్రామంలో ఎక్కడైనా లీకేజీ ఉంటే వాటిని నేను సరి చేస్తానని నీటి నిల్వలను పెంచే కార్యక్రమాలను చేపడతానని చెప్పారు. స్కూల్ యాజమాన్యం బాలవికాస సంస్థ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని అలాగే ఒక్క రూపాయికే వాటర్ ఇస్తూ ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేస్తున్నారని వారు చేసే పలు సేవా కార్యక్రమాలు బాగున్నాయని అన్నారు. అన్ని సేవా సంస్థలల్లో బాలవికాస సంస్థ చాలా పెద్దదని కొనియాడారు.

మాట్లాడుతున్న బాలవికాస ఇంచార్జ్ ఖాజాబీ..

కార్యక్రమంలో పాల్గొన్న బాలవికాస ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు..

నీటి పొదుపుపై గ్రామంలో ర్యాలీ చేస్తున్న బాలవికాస ప్రతినిధులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!