Social 1080×1350 • Multi-page
21-03-2026 BREAKING NEWS 12:39 PM
swarnodayam.com
Telugu Daily News

భార్య మృతినీ తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య

భార్య మృతినీ తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య
1004763348

–మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి
–జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో ఉరి వేసుకున్న ఎస్సై చంద్రశేఖర్
–అనాథలైనా ఇద్దరు చిన్నారులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేట గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింటికీ వచ్చి ఉరి వేసుకుని బలవర్మరణానికి పాల్పడటం పోలీసులను విస్మయనికి గురిచేసింది. చంద్రశేఖర్ యాదవ్ భార్య తల్లిగారింటికి వచ్చిన అనంతరం డ్రెస్ మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన అప్పటికే ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే జమ్మికుంట పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకునీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

భార్య  ఆత్మహత్యతో మానసిక వేదనకు గురై…

రెండు రోజుల క్రితం చంద్రశేఖర్ యాదవ్ భార్య దివ్య కడుపునొప్పిని తట్టుకోలేక గన్నేరు పప్పు నూరుకొని తిని ఆత్మహత్యయత్నముకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనతో ఇరువురి కుటుంబం మొత్తం ఇప్పటికే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య అంత్యక్రియల కోసం అత్తగారింటికి వచ్చిన ఆయన గత రెండు రోజులుగా ఆయన మౌనంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం గమనించామని బంధువులు తెలిపారు. తీవ్ర మానసికంగా కుంగిపోయిన ఆయన తన సగభాగమైన అర్ధాంగి తను చాలించడంతో తను జీవించడం వ్యర్థం అనుకొని ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.

అనాథలైన ఇద్దరు చిన్నారులు..

కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో వారి సంతారమైన ఇద్దరు పిల్లలు ఒంటరిగా (అనాధలుగా) మారారు. రెండు రోజులు భార్యాభర్తలు ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడడంతో స్థానికంగానే కాకుండా జిల్లాలోనే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. పెద్ద దిక్కున కోల్పోయిన ఇద్దరు చిన్నారుల భవిష్యత్‌పై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై స్థానికులు, పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి, పోలీసుల కుటుంబ పరిస్థితులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై కూడా విచారణ చేయాలని, ఇలాంటి సంఘటనలు మరోసారి ఎక్కడ జరగకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ – దివ్య (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!