Social 1080×1350 • Multi-page
21-03-2026 BREAKING NEWS 10:09 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ విప్‌ డాక్టర్ బల్మూరి వెంకట్‌ కు ప్రజా సంఘాల వినతిపత్రం.

ప్రభుత్వ విప్‌ డాక్టర్ బల్మూరి వెంకట్‌ కు ప్రజా సంఘాల వినతిపత్రం.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ ను రద్దు చేయించాలని కోరుతూ శనివారం హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వ విప్‌ డాక్టర్ బల్మూరి వెంకట్ నర్సింగ్‌రావుకు ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విప్ గా ఎంపికైన తరువాత ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ మొదటిసారిగా హుజురాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పనికి శాలువాలతో సత్కరించారు. ఆయనకు ప్రభుత్వ విప్పు పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు డంపింగ్‌ యార్డ్‌ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కలిసి డంపింగ్‌ యార్డ్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డ్‌ వల్ల గాలి, నీటి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు వివరించారు. ముఖ్యంగా గ్రామాలు, కాలనీలకు సమీపంగా చెత్త యార్డ్‌ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకుని, యార్డ్‌ను మార్చాలని విజ్ఞప్తి చేశారు.. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ డాక్టర్ బల్మూరి వెంకట్‌ కు ప్రజా సంఘాల నేతలు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!