22-03-2026 NORMAL NEWS 11:10 PM
swarnodayam.com
Telugu Daily News
22-03-2026 11:10 PM By Mandala Yadagiri

డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ గలవెత్తిన అఖిలపక్షం – ధర్నాలు, దీక్షలు చేసి అడ్డుకుంటాం

డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ గలవెత్తిన అఖిలపక్షం – ధర్నాలు, దీక్షలు చేసి అడ్డుకుంటాం
IMG-20260322-WA0043

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజల ప్రాణాలకు పర్యావరణానికి హానికరంగా మారే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల హుజురాబాద్ ప్రాంత ప్రజల జీవితాలకు ప్రాణాలకు విలువ లేదా అంటూ ప్రజలు నేతలను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదులోని జవహర్ నగర్, వరంగల్లోని మడికొండ, కరీంనగర్ పట్టణంలో ఏర్పాటైన డంపింగ్ యార్డులపై తాము రోగాల బారిన పడుతున్నామని, భవిష్యత్తు అంధకారం అవుతుందని ప్రజలు నిరసనలు తెలుపుతుంటే ప్రజాగ్రహానికి భయపడి అక్కడి నుండి హుజురాబాద్ కు తరలించడానికి ప్రభుత్వం సిద్ధపడటం పట్ల ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ వ్యవహార తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ -సిర్సపల్లి ప్రాంతాల శివారులోని గుట్టల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన భారీ డంపింగ్ యార్డ్ ను అడ్డుకోవడానికి రాజకీయాలకతీతంగా ప్రజలు అఖిలపక్షం ఆధ్వర్యంలో గళ మేత్తారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ప్రజా సంఘాలు, మేధావులు, రైతులు యువకులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిపిపి పద్ధతిలో వేస్ట్ టు ఎనర్జీ (డబ్ల్యూటిఈ) పద్ధతిలో గణేష్ నగర శివారులోని గుట్టల్లో డంపింగ్ యార్డును కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందనీ, ఈ డంపింగ్ యార్డ్ లో వరంగల్ కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ లతోపాటు జమ్మికుంట, హుస్నాబాద్, చొప్పదండి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల నుండి ప్రతిరోజు 8 టన్నుల చెత్తను సేకరిస్తుందన్నారు . ప్రతిరోజు 800 టన్నుల చెత్తను ఇక్కడికి తరలించి దగ్ధం చేస్తారని, దీంతో ఓజోన్ పొర కు కొరకు నష్టం కలిగించే కాడ్మియం అనే విష వాయువు వెలుబడుతుందనీ, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, చర్మ సంబంధ వ్యాధులతోపాటు నీటి, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందన్నారు. ఈ వాయువు శరీర అవయవాల్లోకి వెళితే ఆ ప్రాంతంలో డిఎన్ఎ తగ్గిపోయి క్యాన్సర్ వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఉన్న 15 కిలోమీటర్ల దూరం వరకు దీని వలన నష్టం ఉంటుందన్నారు.
ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు రాజకీయాలకతీతంగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు జీవితాలకు నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ను అడ్డుకుంటామని ధర్నాలు దీక్షలు చేపడతామని, అన్ని రాజకీయ పార్టీల తో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి సీఎం వద్దకు వెళ్లాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని వివిధ రకాల కమిటీలు వేసి వాటి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించారు.

అసెంబ్లీలో ప్రస్తావిస్తా… ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ లో ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ పై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, ప్రజలు చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ద్వారా అన్నారు.
**ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా…
చైర్ పర్సన్ సుహాసిని

ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ, ఇన్చార్జి ప్రణవ్ బాబు మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తానని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు.
ప్రజల ప్రాణాలకు విలువ లేదా..
సామాజికవేత్త సబ్బని వెంకట్

హుజురాబాద్ లో ఏర్పాటు తలపెట్టిన డంపింగ్ యార్డ్ వల్ల ప్రజారోగ్య దెబ్బతింటుందని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు ప్రజల ప్రాణాలు పట్టవా..? అని, అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టబోయే ఆందోళనకు తాను మద్దతుగా ఉంటానని సామాజికవేత్త సబ్బని వెంకట్ అన్నారు.
కోర్టులో సవాల్ చేస్తాం… జైపాల్ రెడ్డి

ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ ఏర్పార్టును నిలువరించేందుకు ప్రజలను చైతన్యవంతం చేసి కోర్టు ద్వారా అడ్డుకుంటామని జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి అన్నారు.
కాలుష్య పరిశ్రమలను అడ్డుకోవాలి
ప్రజా ఆరోగ్యానికి నష్టం కలిగించే కాలుష్య పరిశ్రమలను మొదట్లోనే ప్రభుత్వం అడ్డుకోవాలని సిర్స పల్లికి చెందిన కళ్లెపు హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి వేల్పుల రత్నం, ముక్కెర రాజు, పోల్సాని రామారావు, వర్దినేని రవీందర్ రావు, కట్కూరి మల్లారెడ్డి, కొండల్ రెడ్డి, కాశెట్టి కుమార్, బెల్లి రాజయ్య, వేల్పుల ప్రభాకర్, రాముల కుమార్, వెంకట్ రెడ్డి, వెంకటరాజo, ఎల్లయ్య, వెంకన్న, మార్త రవీందర్, నారాయణరెడ్డి, శoతన్ రెడ్డి, సమ్మయ్య, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

,

మాట్లాడుతున్న సామాజికవేత్త సబ్బని వెంకట్

మాట్లాడుతున్న అఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి

హాజరైన అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!