23-03-2026 NORMAL NEWS 01:43 AM
swarnodayam.com
Telugu Daily News
23-03-2026 01:43 AM By Mandala Yadagiri

రైతు మహాగర్జన సభను విజయంతం చేయాలి. -పలువురినీ ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

రైతు మహాగర్జన సభను విజయంతం చేయాలి. -పలువురినీ ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
IMG_20260323_013918

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ లో ఏప్రిల్ 28 న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రైతుల మహాగర్జన సమరభేరికి ఆహ్వానిస్తూ కరీంనగర్ శాసన సభ్యుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి పత్తి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావులకు ఆహ్వాన పత్రం అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
అన్నధాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పాలకులను హెచ్చరించారు.
ఆదివారం మహాగర్జన సమరభేరి సభ విజయవంతానికి కరీంనగర్ పట్టణంలో పోలాడి రామారావు విస్తృతంగా పర్యటిస్తూ వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారు. ఇందులొ భాగంగా స్ధానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను క్యాంప్ కార్యాలయంలో నాయకులతో కలిసి మహాగర్జన ఏర్పాట్లపై వివరించి సభకు ఆహ్వానిస్తూ శాలువా కప్పి ఆహ్వాన పత్రం అందజేసి గోడ ప్రతులను గంగుల కమలాకర్ చే ఆవిష్కరించారు. కార్పొరేటర్లు చల్లా హరిశంకర్, రవీందర్ సింగ్, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొని మహాగర్జనకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పత్తి వాసుదేవరెడ్డినీ, నాయకులను, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావులను వారి కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసి గోడ ప్రతులను వారిచే రామారావు ఆవిష్కరింపహేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పత్తి వాసుదేవరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావులు మాట్లాడుతూ తాము సంపూర్ణంగా రైతుల మహాగర్జన సమర భేరి సభకు తమ పార్టీల తరపున మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున రైతుల తో కలిసి సమావేశానికి తరలి వస్తామని ప్రకటించడం పట్ల రామారావు కృతజ్ఞతలు తెలిపారు.
అన్న దాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోలాడి రామారావు రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ లో ఏప్రిల్ 28న పార్టీల కతీతంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నామని అంచనాలకు మించి సభ విజయవంతం చేయాలని రామారావు పిలుపు ఇచ్చారు.

అనంతరం కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యులు సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లను రామారావు కలిసి మహాగర్జన సమర భేరి సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేసి మద్దతు ఇవ్వాలని రామారావు కోరగా పార్టీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని రైతాంగ సమస్యల పరిష్కారానికి తాము అండగా ఉంటామని ప్రకటించినట్లు రామారావు తెలిపారు.

ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కరీంనగర్ లో లక్ష మందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సమరభేరి సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందిస్తూ పార్టీల కతీతంగా మద్దతు కూడ గడుతున్నట్లు రామారావు తెలిపారు.పార్టీల కతీతంగా నిర్వహించే రైతుల మహాగర్జన సమర భేరి సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 20 వేల మంది మహిళలను రైతులను తరలుస్తున్నమని రామారావు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!