Social 1080×1350 • Multi-page
24-03-2026 BREAKING NEWS 12:41 AM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ సిర్సపల్లి గ్రామస్తుల దీక్ష

డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ సిర్సపల్లి గ్రామస్తుల దీక్ష
IMG-20260324-WA0005

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పి పి పి పద్ధతిలో డబ్ల్యు టి.ఈ రూపంలో ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిరసిస్తూ సోమవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సిర్సపల్లి గ్రామస్తులు దీక్ష చేపట్టారు. దీక్షకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ -సిర్సపల్లిల మధ్య ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ వల్ల ఈ ప్రాంతంలోని ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం పెరిగిపోవడమే కాకుండా దుర్వాసన చర్మవ్యాధులు క్యాన్సర్ మొదలైనటువంటి ప్రజలకు వస్తాయని అన్నారు. ఇతర జిల్లాలలో ప్రజలు వద్దనుకున్న డంపింగ్ యార్డ్ ను హుజురాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం దారుణమని అన్నారు. 15 కిలోమీటర్ల మేర డంపింగ్ యార్డ్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయని ప్రభుత్వం చూస్తూ చూస్తూ ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదన విరమించే వరకు శాంతియుత పద్ధతిలో తెలుపుతామని అన్నారు. రాజకీయలకు అతీతంగా ఈ దీక్షకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇది కేవలం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టిన దీక్షలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పలకల ఈశ్వర్ రెడ్డి సిరసపల్లి గ్రామ సర్పంచ్ పోసాని రామారావు రాజపల్లి సర్పంచ్ కట్కూరు మల్లారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి, గ్రామ ప్రముఖులు ఎడ్ల విజయ్ కుమార్, వేమారెడ్డి వెంకట్రెడ్డి, హనుమంతరావు, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, వెంకన్న, లక్ష్మణమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
—ప్రముఖుల సంఘీభావం
డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ శిరసపల్లి గ్రామస్తులు చేపట్టిన దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతుగా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, రాముల కుమార్, టాప్ర జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మారేపల్లి శీనువాస్, తునికి వసంత్, డాక్టర్ టి శేఖర్, కౌన్సిలర్ కాలిక్ హుస్సేన్, కొలిపాక సమ్మయ్య, మార్త రవీందర్, కళ్లెపు రాఘవరావు, పందిలా సురేందర్, చిలకమారి శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, సురేందర్, ఉప సర్పంచ్ శివాజీ, ఆకుల సదానందం తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న సిరసపల్లి గ్రామస్తులు, మద్దతుదారులు..

దీక్షలో పాల్గొన్న సిరసపల్లి గ్రామస్తులు వారికి మద్దతుదారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!