25-03-2026 NORMAL NEWS 08:21 PM
swarnodayam.com
Telugu Daily News
25-03-2026 08:21 PM By Mandala Yadagiri

తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పట్ల హర్షం. – సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పట్ల హర్షం. – సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
IMG-20260325-WA0034

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పట్ల హుజురాబాద్ పట్టణంలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోర్టు గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ బిల్లు వల్ల న్యాయవాదుల హక్కులు కాపాడబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, టీపీసీసీ లీగల్ సేల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ, సీనియర్ న్యాయవాదులు ముక్కెర రాజమౌళి, యతిపతి అరుణ్ కుమార్, నూతల శ్రీనివాస్, కనుక దేవయ్య, బండి రమేష్ , శివరామకృష్ణ, మోలుగురి విక్రమ్, ముషం .మౌనిక, కే సౌమిత్ర, ఎండి యాస్మిన్, పత్తిపాక నాగరాజు, జి హరిహరన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న న్యాయవాదులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!