26-03-2026 NORMAL NEWS 06:13 PM
swarnodayam.com
Telugu Daily News
26-03-2026 06:13 PM By Mandala Yadagiri

లియాఫీ ఏజెంట్స్ నూతన భవనం వద్ద ఏజంట్ల సమావేశం.. – ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్ బాబు హాజరు..

లియాఫీ ఏజెంట్స్ నూతన భవనం వద్ద ఏజంట్ల సమావేశం.. – ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్ బాబు హాజరు..
IMG-20260326-WA0090

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి 26: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హుజరాబాద్ జమ్మికుంట ఎస్ఓ (SO) లియాఫీ ప్రెసిడెంట్ ముకిరాల సంపత్ రావు, సెక్రెటరీ మునగాల సమ్మారావ్, కోశాధికారి గంట సంపత్ మరియు లియాఫీ కమిటీ ఆల్ ఏజెంట్స్ సభ్యుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు లీయాపి ఏజెంట్ల భవనం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు మరియు మున్సిపల్ చైర్మన్ రోంటాల సుహాసిని, వైస్ చైర్మన్ గూడూరి అంజలి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గూడూరు రాజేశ్వరి, వార్డ్ కౌన్సిలర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి మరియు ఏఈ, కాంట్రాక్టర్ ఈ యొక్క సమావేశానికి హాజరయారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, రాబోయే కాలంలో ఏజెంట్లకు, భవనంలో పూర్తి సహాయ సహకారాలు ఒడితల ప్రణవ్ బాబు అందించి, భవన నిర్మాణంలో వారు ఏజెంట్లకు వారి వంతు సహాయంగా భవన నిర్మాణంలో పూర్తి అయ్యేలా కృషి చేయాలని , లియాఫీ నాయకులు, ఏజెంట్ మిత్రులందరూ కోరుతున్నారు. ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో, ఏజెంట్ల ప్రజాప్రతినిధులకు, నూతన కార్యవర్గానికి శాలువా బొకేలతో సన్మానం ఎల్.ఐ.సి, ఏజెంట్లు నూతనంగా ఎన్నికైన, గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లకు, వార్డు సభ్యులకు, ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఏజెంట్ల సమక్షంలో సన్మానం చేయడం జరిగింది. సిహెచ్ ప్రసాద్ బాబుకు లియాఫీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాలసాని బిక్షపతి, దొమ్మేటి రాజమల్లు, పల్లె రాజయ్య, ఎబ్బుసి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ మంతెన శ్రీనివాస్, భోగం పద్మా -దశరథం, ముత్యాల శ్రీను, వేముల రమేష్, మాతంగి ఎల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ పంజాల తిరుపతిగౌడ్, మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆకుల లలిత, భోజన పెళ్లి ఇంద్రదేవి, బోయినపల్లి మల్లేశ్వరి, రామీడి స్వరూప, ఏబోసి పుష్పలత, మేకల స్వరూప, మీడియా సెల్ చిలుకుమారి సత్యరాజు, ఇంగి రాజేశ్వరరావు, కుడితాడి బాబురావు, మిడిదొడ్డి పరశురాములు, పంజాల తిరుపతి, ఏబూసి లింగమూర్తి, బత్తుల రాజలింగం, బండారి గట్టయ్య బండారి కుమారస్వామి, ఏజెంట్ మిత్రులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బోజనాల దాతగా ఎల్ఐసి అసిస్టంట్ బ్రాంచ్ మేనేజర్ బి సమ్మయ్యకి ఏజెంట్స్ మిత్రులందరూ కృతజ్ఞతలు తెలిపారు.

పూల బొకే ఇచ్చి శాలువా కప్పి సత్కరిస్తున్న లియాఫీ నాయకులు..

మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు

మాట్లాడుతున్న లీయాఫి అధ్యక్షుడు సంపత్ రావు..

ప్రణవ్ బాబుతో లియాఫీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!