27-03-2026 NORMAL NEWS 02:18 PM
swarnodayam.com
Telugu Daily News
27-03-2026 02:18 PM By Mandala Yadagiri

భద్రాచలం నుంచి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు గుర్రపు యాత్ర ప్రారంభించిన రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

భద్రాచలం నుంచి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు గుర్రపు యాత్ర ప్రారంభించిన రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260327_140737

భద్రాచలం దేవాలయ ప్రాంగణంలో భక్తులచే రైతుల మహాగర్జన పోస్టర్ ఆవిష్కరణ.
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి.
రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (భద్రాచలం): అన్న దాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
శుక్రవారం శ్రీరామ నవమి పండుగ సందర్భంగా భద్రాచల సీతా రామచంద్రస్వామి దేవాలయం లోవేకువ జామున కరీంనగర్ లో లక్షలాది మంది రైతులతో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభ విజయవంతం చేయాలని పోలాడి రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి మహాగర్జన సభ గోడ ప్రతులను రామారావు ఆవిష్కరించారు.

సభ విజయవంతం చేయడానికి భద్రాచల దేవాలయ ప్రాంగణం ముందర గుర్రం ఎక్కి పోలాడి రామారావు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ..రాష్ట్రంలో 70 శాతం మిగిలి ఉన్న రెండు లక్షల రుణ మాఫీకి నిధుల కేటాయింపు చేయలేదని, బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిడుదల కేటాయింపులు తగ్గించిన ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని , అన్ని రకాల పంటలకు 500 రూ బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు అడపా దడపా అర కోరగా ఇస్తూ మోసాగించిందన్నారు.
ఇప్పటికే రెండుసార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే విడుదల చేసి రైతులను దేహీ అనే విధంగా హీనంగా పరిగణించే సర్కార్ కు రైతన్నల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిడుదల విడుదల చేయడం లేదని అన్నారు. నామ మాత్రంగానే ఓసి రెడ్డి కార్పొరేషన్ లను ప్రకటించిన ప్రభుత్వం పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని బడ్జెట్తో లో నిడుదల కేటాయించక రెడ్డి ఓసిలను మోసగించిందన్నారు .
ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్నీ వర్గాల కుల సంఘాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న ఓసి జేఏసీ రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్షలాది మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను న భూ తో న భవిష్యత్ తరహా లో నిర్వహిఇస్తున్నామని పార్టీల కతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నామని శరవేగంగా సన్నాహక ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలాడి రామారావు తెలిపారు.

కరీంనగర్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభలో ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం అన్నారు.
రైతుకు పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేయాలని
రైతు భరోసా నిధులను పంట సాగు సమయంలోనే విడుదల చేయాలని ఇచ్చిన హామీల మేరకు అన్ని రకాల పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ను ధాన్యపు కొనుగోలు సమయంలోనే చెల్లింపులు చేయాలనీ
కౌలు రైతులకు హామీ నెరవేర్చాలి, ప్రస్తుతం అమలు చేస్తున్న మద్దతు ధర కాకుండా రైతుకు పెట్టుబడి తగ్గట్టుగా గిట్టుబాటు ధర అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలి, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలి, ఆయకట్టు చివరి భూముల వరకు నీళ్లు అందించే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత ఉన్నందున జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, రైతు బీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుండి 70 ఏళ్ల వరకు పెంచాలి 50000 ఏదైనా ప్రతి రైతుకు నెలకు 6000 రూపాయల జీవన భృతి కల్పించాలి. ప్రతి రైతుకు ఆరోగ్య సమస్యల చికిత్స నిమిత్తం 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని కార్పొరేట్ హాస్పిటల్ లో అవకాశం కల్పించాలి, నామాత్రంగా ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్ కు తక్షణమే నిధులు కేటాయించి పాలకమల్ని ఏర్పాటు చేయాలి. రైతులకు వ్యవసాయ యాంత్రికరణ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను 75% సబ్సిడీతో అందించాలి, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదల సంక్షేమానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పటిష్టమ అమలుకై జాతీయ రాష్ట్రస్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం ఒకే రకమైన వార్షిక ఆదయ పరిమితిని పెంచాలి. ఈడబ్ల్యూ ఎస్ అర్హతకు అధికారులు జారీ చేసే సర్టిఫికెట్ కఠిన షరతులు లేకుండా ఐదు సంవత్సరాల వరకు పరిమితి ఉండేలా వర్తింప చేయాలి. యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు ఇచ్చిన హామీ మేరకు ఏటా జాబు క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలని ప్రభుత్వాలను రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజా సంఘాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, ప్రజా సంఘాల జాతీయ నాయకులు సాంబశివరావు, నాయకులు అయిత నాగరాజు, రాజయ్య, అంజయ్య తదితరులు ఉన్నారు.

భక్తులతో కలిసి పోస్టర్ ఆవిష్కరిస్తున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!