Social 1080×1350 • Multi-page
27-03-2026 BREAKING NEWS 02:38 PM
swarnodayam.com
Telugu Daily News

రామనామ స్మరణతో మారుమ్రోగిన ఇల్లందకుంట.. – అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుక.

రామనామ స్మరణతో మారుమ్రోగిన ఇల్లందకుంట.. – అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుక.
IMG_20260327_143222

—కళ్యాణం కమనీయం-సీతారాముల కల్యాణం..

—ప్రభుత్వం తరుపున పట్టు వస్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, కరీంనగర్ సిపి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్.

–పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం.

–ప్రతి ఏటా భక్తులకు అన్నదానం చేస్తున్న జమ్మికుంట రైస్,కాటన్ మిల్లర్లను అభినందించిన మంత్రి పొన్నం,ఇంచార్జి ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట): అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీ రామ నవమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ రాముడి దయవల్ల ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, సిపి గౌస్ ఆలం, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తో కలిసి పాల్గొని అందజేశారు.అంతకు ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికారు.కళ్యాణం ఆద్యంతం రామనామ స్మరణతో కమనీయంగా జరిగింది.అనంతరం ఆలయ ఆవరణలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీనీ కార్యక్రమాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని కళ్యాణానికి వచ్చే భక్తులు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నామని తెలిపారు.కళ్యాణానికి వచ్చిన భక్తులకు జమ్మికుంట రైస్,కాటన్ మిల్లర్లు ప్రతి సంవత్సరం ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల మిల్లర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఇల్లందుకుంట ఆలయ చైర్మెన్ ఇంగిలి రామారావు, డైరెక్టర్లు,హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, జమ్మికుంట కౌన్సిలర్లు, జమ్మికుంట, కమలాపూర్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తున్న మంత్రి పొన్నం, కలెక్టర్, సిపి, కాంగ్రెస్ నేత ప్రణవ్ తదితరు..

సీతారాముల కల్యాణంను తిలకిస్తున్న మంత్రి, కలెక్టర్, అదనపు కలెక్టర్, సిపి తదితరులు..

మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్న కలెక్టర్..

మజ్జిగ తాగుతున్న మంత్రి, ప్రణవ్ తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!