Social 1080×1350 • Multi-page
27-03-2026 BREAKING NEWS 07:40 PM
swarnodayam.com
Telugu Daily News

శివ రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం

శివ రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం
IMG-20260327-WA0187

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ లోని శివ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ట్రస్ట్ చైర్మన్ క్యాస చక్రధర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ వారు వచ్చిన భక్తులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండ చలువ పందిర్లు,మరియు కూలర్లు, మజ్జిగ, స్వామివారి పానకము అందజేశారు. కళ్యాణ అనంతరం అన్నప్రసాద వితరణ మరియు భక్తులందరికీ స్వామివారి అక్షింతలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలను గందె నాగరాజు దంపతులు, దాసి కరుణశ్రీ కుమారస్వామి దంపతులు, డాన్స్ టీచర్ శ్వేత మేడమ్ మరియు ముత్యాల తలంబ్రాలను క్యాస చక్రదర్ దంపతులు మరియు పుస్తే మట్టెలు వినాయక జువెలరీస్ హన్మకొండ వారు మజ్జిగను మొలుగు పున్నం చందర్ అందజేశారు. ఈ రోజు గుడి అలంకరణ చీకోటి రాహుల్ సరస్వతి అందచేసారు. ఈ కార్యక్రమంలో పురోహితులు చెరుకుపల్లి శ్రీధర్ ఆచార్యులు, రామాచారి, నిఖిల్ శర్మ, కమిటీ సభ్యులు బుర్ర ఆగయ్య, శ్రీహరి, భూసారపు బాపూరావు, ఆకుల సదానందం, శనిగరపు నరేందర్, క్యాస కమల్ కుమార్, బుర్ర నటరాజ్, భూసారపు శ్రీనివాస్, గట్టు మహాదేవ్, గుడ్డెలుగుల చైతన్య, యథీపతి అరుణ్ కుమార్, చిదురాల నాగరాజ్, అకినేపల్లి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ లోని శివ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం వేడుకల దృశ్యాలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!