Social 1080×1350 • Multi-page
28-03-2026 BREAKING NEWS 06:42 PM
swarnodayam.com
Telugu Daily News

డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా కార్టూన్లతో ఆకట్టుకున్న కార్టూనిస్టు

డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా కార్టూన్లతో ఆకట్టుకున్న కార్టూనిస్టు
IMG-20260328-WA0159

— డంపింగ్ యార్డ్ న రద్దు చేయాలని మహిళల నిరసన ప్రదర్శన

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ కార్టూనిస్ట్ కొండా రవి ప్రసాద్ వినూత్నంగా కార్టూన్ల ప్రదర్శన నిర్వహించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలను తన కార్టూన్ల ద్వారా స్పష్టంగా చూపిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన చేపట్టినట్లు కొండ రవిప్రసాద్ తెలిపారు. “నా ప్రాంతానికి అన్యాయం జరిగితే స్పందించడం ఒక కళాకారుడిగా నా బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. ప్రదర్శనలో ఉంచిన కార్టూన్లు డంప్ యార్డ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రతిబింబిస్తూ, సమస్య తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఈ వినూత్న ప్రయత్నానీ అభినందిస్తూ, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కొండా రవి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కార్టూన్లతో ప్రజలను చైతన్యపరిచిన రవి ప్రసాద్ ను స్థానికులు అభినందించారు.

డంపు యార్డుకు వ్యతిరేకంగా కార్టూన్లతో ఆకట్టుకున్న కార్టూనిస్టు కొండా రవి ప్రసాద్..

డంపు యార్డుకు వ్యతిరేకంగా కొండ రవి ప్రసాద్ గీసిన కార్టూన్లు..

Oplus_16908288
డంపు యార్డు వల్ల ఏర్పడే అనర్థాల గురించి చక్కగా అర్థమయ్యే రీతిలో కార్టూన్ గీసిన రవి ప్రసాద్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!