Social 1080×1350 • Multi-page
28-03-2026 BREAKING NEWS 09:32 PM
swarnodayam.com
Telugu Daily News

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. – హాజరైన మండల విద్యాశాఖ అధికారి విడపు శ్రీనివాస్

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. – హాజరైన మండల విద్యాశాఖ అధికారి విడపు శ్రీనివాస్
IMG_20260328_190237

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం రోజున లీడ్ కరికులంలో భాగంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ మండల విద్యాశాఖ అధికారి విడపు శ్రీనివాస్, లీడ్ అకాడమిక్ మేనేజర్ ఐశ్వర్యలు హాజరయ్యారని పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థులు స్వయంగా ప్రాజెక్టులు తయారు చేయడం చాలా గొప్ప విషయమని, అలాగే విజ్ఞాన్ పాఠశాలలో మూస పద్ధతిలో విద్యాబోధన చేయకుండా, ప్రస్తుత పోటి ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులందరినీ సృజనాత్మకతతో కూడిన ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తున్నందుకు యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను అభినందించారు. తదనంతరం లీడ్ అకాడమీక్ మేనేజర్ ఐశ్వర్య లీడ్ కరికులం గూర్చి వివరిస్తూ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న కరికులమని, ప్రస్తుత తరం విద్యార్థులకు తగ్గట్టుగా దీనిని ఏర్పాటు చేశామని, మార్కులే ప్రామాణికంగా కాకుండా విద్యార్థులు లర్నింగ్ బై డూయింగ్ మెథడ్ లో నేర్చుకుంటారని, సీబీఎస్ఈ పాఠశాలలకు దీటుగా ఈ కరికులం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆనంతరం పాఠశాల కరెస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులను ఇన్నోవేటివ్ గా తయారు చేయడానికి ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ని నిర్వహిస్తామని, తమ పిల్లలలో సృజనాత్మకత అభివృద్ధి చెందడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో తాము ఎప్పుడు ముందుంటామని, లీడ్ కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు తయారు చేసిన మోడల్ ప్రాజెక్టులు, చార్టులు అందరిని ఆకట్టుకోవడంతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అతిథులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తిరుపతి యాదవ్, లీడ్ అకాడమిక్ కోర్డినేటర్ సుమలత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించి పరిశీలిస్తున్న ఎంఈఓ విడపు శ్రీనివాస్..

పరిశీలిస్తున్న లీడ్ అకాడమీక్ మేనేజర్ ఐశ్వర్య

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!