28-03-2026 NORMAL NEWS 11:49 PM
swarnodayam.com
Telugu Daily News
28-03-2026 11:49 PM By Mandala Yadagiri

లోక్ అదాలత్‌లో 975 కేసుల పరిష్కారం. – రాజీ మార్గం ద్వారా తమ వివాదాలను పరిష్కరించుకోవాలి. – సీనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పిబి కిరణ్ కుమార్

లోక్ అదాలత్‌లో 975 కేసుల పరిష్కారం. – రాజీ మార్గం ద్వారా తమ వివాదాలను పరిష్కరించుకోవాలి. – సీనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పిబి కిరణ్ కుమార్
IMG_20260328_234622

మండల యాదగిరి,​ స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 975 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతూ… కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గం ద్వారా తమ వివాదాలను పరిష్కరించుకోవాలని అన్నారు. దీనిద్వారా సమయం ధనం ఆదా అవుతాయని అన్నారు. ​​ఈ అదాలత్‌లో 952 క్రిమినల్ కేసులు, 05 సివిల్ కేసులు, 15 బ్యాంక్ పి.ఎల్.సిలు, మరియు 03 బి.ఎస్.ఎన్.ఎల్ పి.ఎల్.సిలతో కలిపి మొత్తం 975 కేసులు పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా రూ. 36,80,132/- మొత్తానికి సంబంధించి సెటిల్‌మెంట్ జరిగినట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి మీన ప్రణతి, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ టి. ఈశ్వరయ్య, లోక్ అదాలత్ సభ్యులు బి కుమారస్వామి, ఎ వెంకటేశ్వరరావు, వై అరుణ్ కుమార్, పోలీస్ బ్యాంక్ అధికారులు, బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

కేసులు పరిష్కారీస్తున్న సీనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పిబి కిరణ్ కుమార్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!