Social 1080×1350 • Multi-page
29-03-2026 BREAKING NEWS 03:31 PM
swarnodayam.com
Telugu Daily News

దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగదు. – సీనియర్ దళిత ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి తీరు సిగ్గుచేటు.. – వెంటనే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ నేత ప్రణవ్.

దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగదు. – సీనియర్ దళిత ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి తీరు సిగ్గుచేటు.. – వెంటనే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ నేత ప్రణవ్.
IMG-20260329-WA0098

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళితుల పట్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివక్ష చూపెట్టడం తగదని, నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల శాసన సభ వేదికగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరమని, దీనిపై వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి దళితులపై దుర్భాషలాడడం ఇదేం కొత్త కాదని గతంలో కూడా ఇలాంటి రకమైన ప్రవర్తన కొనసాగించాడని తాజాగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా కౌశిక్ రెడ్డి సీనియర్ దళిత ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని, ఇలాంటివి రాజకీయాల్లో మంచివి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గల్లీలో పరువు తీస్తే తన పిచ్చి వల్ల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పరువు అసెంబ్లీ సాక్షిగా తీసాడని మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కౌశిక్ రెడ్డి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!