Social 1080×1350 • Multi-page
29-03-2026 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. – ఖబడ్దార్ కౌశిక్ రెడ్డి.

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. – ఖబడ్దార్ కౌశిక్ రెడ్డి.
IMG-20260329-WA0145

–దళితులంటే ఎందుకు నీకు చిన్న చూపు..

–దళిత ఎమ్మెల్యేను అవమానించేలా నీ ప్రవర్తన సిగ్గుచేటు..

–ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కౌశిక్ రెడ్డి…

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళిత ఎమ్మెల్యేల పట్ల సభ్య సమాజం పట్ల కౌశిక్ రెడ్డి నోరుజారడం పరిపాటి అయ్యిందని, ఇంకోసారి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల పట్ల కౌశిక్ రెడ్డి మొదటి నుండి చిన్న చూపు చూస్తున్నాడని, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ గౌరవించే నాయకుడు కడియం శ్రీహరి అని,కేసీఆర్ తో సమానమైన రాజకీయ అనుభవం కలిగిన శాసన సభ్యుని పట్ల కౌశిక్ రెడ్డి వీధి రౌడీలాగా వ్యవహరించడం సిగ్గు చేటని వెంటనే అతని శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, నియోజకవర్గ నాయకులు సందమల్ల నరేష్, నియోజకవర్గ నాయకులు సందమల్ల బాబు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చిట్యాల రేవంత్, జనరల్ సెక్రెటరీ కందుల సందీప్, ,మండల వైస్ ప్రెసిడెంట్ సందీప్, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ నాగమణి, కోయల్ కార్ సమన్ కెఆర్ గౌడ్ రవితేజ, తిరుమల్, అజిత్, కొండ్ర అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..

ఖబడ్దార్ కౌశిక్ రెడ్డి అంటూ నినదిస్తున్న యూత్ కాంగ్రెస్ నేతలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!