Social 1080×1350 • Multi-page
30-03-2026 BREAKING NEWS 02:51 PM
swarnodayam.com
Telugu Daily News

కౌశిక్ రెడ్డి ఇంటిపైన కోడి గుడ్లు, టమాటాల దాడి, దిష్టి బొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

కౌశిక్ రెడ్డి ఇంటిపైన కోడి గుడ్లు, టమాటాల దాడి, దిష్టి బొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
IMG_20260330_144736

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేసి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదలు చేసారు. అనంతరం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశలలో దళిత శాసనసభ్యులు కడియం శ్రీహరి పైన మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే హుజురాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. MLA శాసనసభ సభ్యత్వం రద్దు అయ్యేవరకు మా యూత్ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రవణ్, అసెంబ్లీ ఉప అధ్యక్షులు బండ నవీన్, ప్రధాన కార్యదర్శి శనిగరపు తరుణ్, చిట్యాల రేవంత్, మండల ఉప అధ్యక్షులు మేకల రాజ్ కుమార్, చల్లూరి విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి పంజాల రాజుగౌడ్, నాయకులు ఎండీ సాధిక్, జన్ను ప్రసాద్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

కోడిగుడ్లు టమాటాలతో ఎమ్మెల్యే నివాసంపై దాడి చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధము చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!