31-03-2026 NORMAL NEWS 12:59 AM
swarnodayam.com
Telugu Daily News
31-03-2026 12:59 AM By Mandala Yadagiri

30 కోట్లతో మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం – డంపింగ్ యార్డ్ రద్దుకు ఏకగ్రీవ తీర్మానం

30 కోట్లతో మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం – డంపింగ్ యార్డ్ రద్దుకు ఏకగ్రీవ తీర్మానం
IMG-20260331-WA0010

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 2026-27 ఆర్ధిక సంవత్సరానికి హుజురాబాద్ మున్సిపల్ 30 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు, డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ మొదటి ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టినట్లు హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ బడ్జెట్లో ఆస్తి పన్నులు 3,29,65,000 రూపాయలు, స్టాంపు డ్యూటీ 65,00,000 రూపాయలు, ఇతర ఫీజులు, కిరాయలు 78,70,000 రూపాయలు,
భవన నిర్మాణాలు / LRS ఆదాయం 4,95,00,000 రూపాయలు, తైబజారు, ట్రేడ్ లైసెన్స్ ఇతర పారిశుద్ధ్య ఆదాయం 56,50,000 రూపాయలు,నల్లా పన్నులు, రోడ్డు కటింగ్ 79,50,000 రూపాయలు, డిపాజిట్ల ఆదాయం 20,00,000 రూపాయలు,కేంద్ర/రాష్ట్ర నిధులు 19,45,00,000 రూపాయలు,
మొత్తం ఆదాయం 30,69,35,000 రూపాయలుగా నిర్ణయించనైనదని ఆమె తెలిపారు. ఇందులో ఖర్చులు ఔట్ సోర్స్ / కాంట్రాక్టు సిబ్బంది జీతాలు 3,72,00,000 రూపాయలు, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులు 2,12,00,000 రూపాయలు, వీధి దీపముల నిర్వహణ 1,08,50,000 రూపాయలు, సాధారణ నిధుల నుండి గ్రీన్ బడ్జెట్ 1,10,44,000 రూపాయలు, వీకర్ సెక్షన్స్ 48,26,000 రూపాయలు, నీటి సరఫరా నిర్వహణ 28,50,000 రూపాయలు,పండుగలు, వాహనాల కిరాయ ఇతర వ్యయములు 1,25,15,000 రూపాయలు, వార్డుల మ్యాపింగ్ / ఇతర వీది బోర్డుల నిర్వహణ 3,00,000 రూపాయలు, వార్డులలో అభివృద్ధి పనుల కొరకు 96,50,000 రూపాయలు, డిపాజిట్ల వ్యయం 20,00,000 రూపాయలు,కేంద్ర/రాష్ట్ర నిధులు 19,45,00,000 రూపాయలు
మొత్తం వ్యయం 30,69,35,000 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో 26 అంశాలు ప్రవేశపెట్టగా వాటిని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. కోతుల బెడద నివారణ కోసం 4 లక్షలు, రోడ్ల నిర్మాణముల కొరకు 7. 50 కోట్లు, మురికి కాలువల నిర్మాణముల కొరకు 6 కోట్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయుటకు కోటి రూపాయలు ప్రతిపాదించగా ఆమోదించినట్లు ఆమె అన్నారు.
ఈ సమావేశంలో మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జూనియర్ అకౌంట్స్ అధికారి ఎస్. ఆరతి, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, టి.పి.ఎస్. ఎన్ అశ్వినీగాంధీ, ఐ. రమేష్ , సి.హెచ్. గోపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ వినయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    సమావేషంలో మాట్లాడుతున్న చైర్ పర్సన్ సుహాసిని…

    Oplus_16908288
    Oplus_16908288

    హాజరైన బల్దియా పాలకవర్గ సభ్యులు

    Oplus_16908288

    Reporter

    • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

    error: Content is protected !!