Social 1080×1350 • Multi-page
31-03-2026 BREAKING NEWS 03:02 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు.

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు.
IMG_20260331_144823

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి రేవంత్ సర్కార్ భారీ షాకిచ్చింది. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న హైదరాబాద్ లోనీ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు సీఐడీ పేర్కొంది. గత జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలో శ్రీసమ్మక్క సారక్క జాతర వేళ గొడవ దృష్ట్యా కౌశిక్ రెడ్డి, కరీంనగర్ సీపీ, పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అధికారులు కేసు బుక్ చేశారు. ఈ కేసును అసెంబ్లీ సాక్షిగా సిఐడి కి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు వెంట ఉన్న మరో పదహారు మంది బండ శ్రీనివాస్, గందే శ్రీనివాస్, ఎడవల్లి కొండాల్ రెడ్డి, కటుకూరి మల్లారెడ్డి, అంజద్ ఖాన్, హర్షద్, కొలిపాక అజయ్, వీడప్ అనురాగ్ కు సైతం సీఐడీ నోటీసులు అందజేసింది.

సిఐడి నుంచి నోటీసులు అందుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

ఎక్స్ వేదికగా తనను సిఐడి, రేవంత్ ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

పోలీస్ స్టేషన్లో హాజరై సిఐడి నోటీసులు అందుకున్న హుజురాబాద్ కు చెందిన బిఆర్ఎస్ నేతలు..

నోటీసులు అందుకోని బయటకి వస్తున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు..

బిఆర్ఎస్ యూత్ నాయకులకు సిఐడి నోటీసులు ఇవ్వగా చూపెడుతున్న దృశ్యం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!