01-04-2026 NORMAL NEWS 04:20 PM
swarnodayam.com
Telugu Daily News
01-04-2026 04:20 PM By Mandala Yadagiri

హుజురాబాద్ ఇంచార్జి డిప్యూటీ డీఎం ఎచ్ఓ గా డాక్టర్ శ్రవణ్

హుజురాబాద్ ఇంచార్జి డిప్యూటీ డీఎం ఎచ్ఓ గా డాక్టర్ శ్రవణ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఇంచార్జి డిప్యూటీ డీఎం ఎచ్ఓ గా డా. శ్రవణ్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం విధులలో చేరారు. ఇంతకుముందు డిప్యూటీ డిఎంహెచ్వో గా ఉన్న డాక్టర్ చందు పిజి సీటు రావడంతో ఖమ్మంలో చేరనుండడంతో రీలువైనట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఆయన స్థానంలో జమ్మికుంట ఆస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రవణ్ ఈ ప్రాంతంలో సీనియర్ వైద్యునిగా ఉండడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించగా నేడు స్వీకరించారు. కాగా ఈ సందర్భంగా హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ నాయకులు కర్ర పాపిరెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, దాసి కుమారస్వామి, బద్ధుల శ్రీధర్, డాక్టర్ రాహుల్, సంగేo శ్రీనివాస్, తిరుపతి తదితరులు పుష్పగుచ్చoలు అందజేసి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_16908288

హుజురాబాద్ ఇంచార్జి డిప్యూటీ డీఎం ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రవణ్ కు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!