Social 1080×1350 • Multi-page
01-04-2026 BREAKING NEWS 05:11 PM
swarnodayam.com
Telugu Daily News

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మున్సిపల్ వద్ద కార్మికుల నిరసన.

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మున్సిపల్ వద్ద కార్మికుల నిరసన.
IMG-20260401-WA0070

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ అవరణములో అటెండెన్స్ పాయింట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించిన పిలుపు మేరకు కార్మిక వ్యతిరేక వినాశకర లేబర్ కోడ్లు రద్దు చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ సవరణ బిల్లు 2021 తీసుకోవాలని, కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని మున్సిపల్ కార్మికులు అటెండెన్స్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎండి అజ్జూ, ప్రధాన కార్యదర్శి బోరగల కుమార్ (రాజు), ఉపాధ్యక్షులు రసపెల్లి సరోజన, రాశపెల్లి క్రాంతి కుమార్, అన్నపూర్ణ, కోశాధికారి రామగిరి సులోచన, సహాయ కార్యదర్శి రొంటాల రాజేశ్వరి, కొలుగురి కుమార్, సోషల్ మీడియా ఇన్చార్జి సతీష్, ప్రచార కార్యదర్శి జెల్ల రాజేష్, సభ్యులు రోంటాల భాగ్య, మహేష్, బండ స్వామి, వినోద, బొరగాల బొండయ్య, సుశీల తదితర కార్మికులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లను నిరసిస్తూ నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!