Social 1080×1350 • Multi-page
01-04-2026 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ను కాపాడుకుందాం కరపత్రం ఆవిష్కరణ

హుజురాబాద్ ను కాపాడుకుందాం కరపత్రం ఆవిష్కరణ
IMG-20260401-WA0069

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ పీవీ సేవా ట్రస్ట్ అధ్యక్షులు బెల్లి రాజయ్య రూపొందించిన హుజురాబాద్ ను కాపాడుకుందాం అనే కరపత్రాన్ని హుజురాబాద్ లో ఆవిష్కరించారు. బుధవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ చేపట్టిన నిరసన దీక్ష శిబిరం వద్ద కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెల్లి రాజయ్య మాట్లాడుతూ….డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో జరిగే వాతావరణ నీటి కాలుష్యాల వల్ల జరిగిన నష్టాలను ఈ కరపత్రంలో పొందుపరిచాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ…ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కరపత్రం ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పీ ఈశ్వర్ రెడ్డి, పోలాడి రామారావు, జైపాల్ రెడ్డి, పోల్సాని రామారావు, వేల్పుల రత్నం, సందెల వెంకన్న, కౌన్సిలర్ కాలిదు హుస్సేన్, తునికి సమ్మయ్య, హనుమంతరావు, ప్రశాంత్, వి రవీందర్రావు, పన్నాల శివాజీ, బాలరాజు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు పట్ల జరిగే నష్టాలను వివరిస్తూ టీవీ సేవ ట్రస్ట్ అధ్యక్షులు బెల్లి రాజయ్య రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!