02-04-2026 NORMAL NEWS 07:13 PM
swarnodayam.com
Telugu Daily News
02-04-2026 07:13 PM By Mandala Yadagiri

ఏప్రిల్ 28న కరీంనగర్ లో 2లక్షల మందితో రాష్ట్ర వ్యాప్త రైతుల మహాగర్జన సమరభేరి – రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఏప్రిల్ 28న కరీంనగర్ లో 2లక్షల మందితో రాష్ట్ర వ్యాప్త రైతుల మహాగర్జన సమరభేరి – రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260402_190858

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28 న కరీంనగర్ లో లక్షలాది మంది తో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభకు హాజరు కావాలని హస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రపంచ ప్రఖ్యాత ములుకనూర్ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని గురువారం భీమదేవరపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నేతృత్వంలో నేతలు కలిసి రైతుల మహాగర్జన సమరభేరి సభ ఆహ్వాన పత్రం అందజేసి ప్రవీణ్ రెడ్డితో కలిసి మహగర్జన గోడ ప్రతులను పోలాడి రామారావు ఆవిష్కరించారు.

ఈసందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మల్కనూర్ విశాల పరపతి సహకార సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి సానుకూలంగా స్పందించి రైతుల మహగర్జన సభకు మద్దతు ప్రకటించిన ప్రవీణ్ రెడ్డికి రైతు ప్రజాసంఘాల జేఏసీ తరపున పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ అన్న దాతలకు విద్యార్థులకు వివిధ సామాజిక వర్గాల కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర బిడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడమే కాకుండా కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాల పంటలకు అర కోరగా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తిందని విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే నిడుదల విడుదల చేసి మభ్య పెడుతోందని మండి పడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయడం లేదని.అన్నదాతలకు విద్యార్థులకు వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
డిమాండ్ల సాధనకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28 న ఓసి జేఏసీ రైతు ప్రజాసంఘాల సంయుక్తాద్వార్యంలో రాజకీయాల కతీతంగా రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీల నేతలను అన్నీ కుల సంఘాల సమాఖ్య రైతు ప్రజాసంఘాల నేతలను స్వయంగా కలిసి ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించారని పోలాడి రామారావు తెలిపారు. రామారావు వెంట రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నాయకులు జిమ్మల భీంరెడ్డి, గూటం జోగిరెడ్డి, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, తాటిపల్లి రాజన్న, బోయినపల్లి రాజేశ్వర్ రావు, వన్యాల విష్ణువర్ధన్ రెడ్డి, పూసాల సంపత్ తదితర ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందజేస్తున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!