Social 1080×1350 • Multi-page
02-04-2026 BREAKING NEWS 07:59 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజల దాహార్తి తీర్చడానికే చలివేంద్రం. – మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని

ప్రజల దాహార్తి తీర్చడానికే చలివేంద్రం. – మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని
IMG-20260402-WA0191

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రమును ప్రారంభించినట్లు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని తెలిపారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలి వేంద్రమును ఆమె ప్రారంభించారు. వేసవికాలం ఉన్నన్ని రోజులు ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రం చౌరస్తాలో కొనసాగుతుందని, ప్రజలు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు, బాటసారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, వర్దినేని రవీందర్ రావు, కోయల్ కార్ భారతి, తాళ్లపల్లి రమేష్, బండ నరేష్, చందమల్ల పుణ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, నాయకులు సందమల్ల బాబు, కోయల్ కార్ బాలాజీ, రషీద్, రాజు, శ్రీనివాస్, వినయ్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభించి, తాగునీరు తాగుతున్న చైర్ పర్సన్ సుహాసిని..

చలివేంద్ర ప్రారంభం వద్ద కౌన్సిలర్లు, ప్రజలతో కలిసి చైర్ పర్సన్, పాలకవర్గ సభ్యులు, కమిషనర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!