Social 1080×1350 • Multi-page
03-04-2026 BREAKING NEWS 10:13 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో బందుకు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార సంస్థలు.. స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ లో బందుకు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార సంస్థలు.. స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
IMG-20260403-WA0019

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం శివారులో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ బంద్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునివ్వగా శుక్రవారం స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య, విద్య సంస్థలు బంద్ పాటిస్తున్నాయి.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వద్దంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిఅర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలపై ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ అక్కడక్కడ షటర్లు తీసి బయట ఎదురుచూస్తున్న వారిని దండం పెడతా.. అమ్మ, అక్క, అన్న, అయ్యా ఇది సమస్య అందరిదీ.. మా ఒక్కరిది కాదు, నీ ఒక్కడిదే కాదు మన అందరి సమస్య.. మనం పోరాడేది భవిష్యత్తు తరాల కోసం.. ఆలోచించండి !అంటూ విజ్ఞప్తి చేస్తూ.. వేడుకుంటూ పలువురి చేత ఎమ్మెల్యే నే వారితో స్వచ్ఛందంగా బంద్ చేయించడం కొసమెరుపు.

స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు..

వాహనాలపై తిరుగుతూ బందు పాటింపజేస్తున్న ఎమ్మెల్యే, వివిధ వర్గాల నాయకులు, ప్రజలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!