Social 1080×1350 • Multi-page
03-04-2026 BREAKING NEWS 11:39 AM
swarnodayam.com
Telugu Daily News

నిరుపేద కుటుంబం సొంతింటి కల నెరవేరిన సమయం..

నిరుపేద కుటుంబం సొంతింటి కల నెరవేరిన సమయం..
IMG_20260403_113624

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం సిర్సపల్లికి మటికే సుజాత -సంపత్ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వీరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించటం జరిగింది. ప్రజా ప్రభుత్వం వీరికి నిధులు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చింది. నియోజకవర్గ బాధ్యుడు ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆ గృహాన్ని నిరుపేద దంపతుల సమక్షంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆడెపు ఆయిలయ్య, వంగల వెంకట్ రెడ్డి, కడారి శంకర్, తునికి లింగయ్య, నగునూరి రజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తునికి రవి కలిసి ప్రారంభించటం జరిగింది. నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఆ నిరుపేద దంపతులకు బట్టలు పెట్టడం జరిగింది. ఆ దంపతుల సొంతింటి కల నెరవేరటంతో వారు సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వానికి, నియోజకవర్గ బాధ్యుడు ప్రణవ్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారిని సన్మానిస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు..

మటికే సుజాత సంపత్ దంపతులకు బట్టలు పెడుతున్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!