Social 1080×1350 • Multi-page
03-04-2026 BREAKING NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News

వినూత్నంగా సామాజిక కార్యకర్త వేణుగోపాల్ నిరసన

వినూత్నంగా సామాజిక కార్యకర్త వేణుగోపాల్ నిరసన
IMG-20260403-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజారోగ్యానికి హాని కలిగించే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ను ప్రభుత్వం విరమించుకోవాలని నిరసిస్తూ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ వినూత్నంగా సైకిల్ పై తిరుగుతూ ప్రచారం చేస్తూ నిరసన తెలిపారు. హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా నిరసన దీక్షలు వివిధ వర్గాల ప్రజలు నాయకులు చేపడుతుండగా, పట్టణానికి చెందిన సామాజికవేత్త నలుబాల వేణుగోపాల్ సైకిల్ పై ‘డంపింగ్ యార్డ్ వద్దు ప్రజారోగ్యమే ముద్దు ‘అనే ప్లెక్సీ తో పట్టణంలోని వీధులన్నీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిరసన దీక్షలు జరిగే ప్రాంతంలో ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. డంపింగ్ యార్డ్ కు నిరసనగా వినూత్నంగా నిర్వహిస్తున్న ప్రచారాన్ని పలువురు అభినందిస్తున్నారు.

వినూత్నంగా సామాజిక కార్యకర్త వేణుగోపాల్ నిరసన తెలుపుతున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!