04-04-2026 NORMAL NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News
04-04-2026 11:27 PM By Mandala Yadagiri

6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. – లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా..!? – సీఎం కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. – లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా..!? – సీఎం కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్
IMG-20260404-WA0127

!మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని, అమలు చేసినట్లు నిరూపిస్తే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు.

శనివారం హుజూరాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ -సిరిసపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, పరిపాలన చేతకాక ఇతరులను విమర్శించడం ఆయనకు ఒక ఫ్యాషన్ గా మారిందన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని వ్యక్తిగా అబద్ధాలు ఆడడం లో సీఎం రేవంత్ రెడ్డి ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చన్నారు. ఇటీవల కేరళo ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యారెంటీలు అమలుపరిచాలని గొప్పలు చెప్పారని అన్నారు.
కేరళ మీడియాను తీసుకుని తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ముఖ్యమంత్రి చెప్పిన అబద్దాలే ప్రధాన కారణమని అన్నారు. కేరళకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో మళ్లీ కాంగ్రెస్ ను ఓడించబోతోందనీ,
కేరళ ప్రజలతో పాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా… ఒక్కసారి తెలంగాణకు రండి, 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయండి అని ఆయన అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి గుండెపై చేయివేసుకుని నిజం చెప్పాలని, మహిళలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ, రూ.4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు రూ.4 వేల బ్రుతీ, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా పైసలు ఇచ్చావా? స్పష్టం చేయాలి. రైతులకు రైతు భరోసా పైసలు కూడా ఎకరానికే పరిమితం చేసి ఊరించి ఊరించి సంపుతున్నారు. అంతెందుకు ఉద్యోగ విరమణ చేసిన వాళ్లకు పెన్షన్ బెన్ ఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదనీ అన్నారు.

డంపింగ్ యార్డు పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదే

గత పాలకులు ప్రతిపాదిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసిందని డంపింగ్ యార్డ్ పాపం బి, ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం అని, జనావాసాల మధ్యలో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదనీ అన్నారు. ప్రజలతోపాటు వన్యప్రాణులకు హాని కలిగించే నిర్ణయమిదనీ, హుజూరాబాద్ ప్రజల ఆందోళనకు బీజేపీ పక్షాన సంపూర్ణ మద్దతిస్తున్నాం అని,తక్షణమే హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ,
లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున బీజేపీ ఉద్యమిస్తుందనీ అన్నారు.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే… డంపింగ్ యార్డ్ ఏర్పాటు స్థలాన్ని పరిశిలించాలి అని ఆయన డిమాండ్ చేశారు. వన్యప్రాణులు నివసించే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఎలా వాసాలు లేని ప్రాంతానికి డంపింగ్ యార్డ్ ను తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!