Social 1080×1350 • Multi-page
06-04-2026 BREAKING NEWS 12:15 AM
swarnodayam.com
Telugu Daily News

అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చిలో ఘనంగా ఈస్టర్ సంబరాలు

అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చిలో  ఘనంగా ఈస్టర్ సంబరాలు
IMG-20260406-WA0005

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చిలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ అనగా ఏమిటి ఆయన సమాధిలో లేడు యేసు లేచాడు ప్రత్యేకతను ప్రారంభ ప్రార్థనతో డోర్కారాణి నాగిశెట్టి వివరించారు.

అనంతరం దైవజేనులు రేవ. దానియేలు నాగీశెట్టి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆగపే కుటుంబ సభ్యులు ఇంచుమించు రెండు వందల మంది పాల్గొన్నారు.
ఈస్టర్ అనేది క్రైస్తవులందరికీ అత్యంత పవిత్రమైన పర్వదినం అని, ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన దినంగా ఈస్టర్‌ను జరుపుకుంటారన్నారు. ఇది ఆశ, పునరుత్థానానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రీస్తవ సంఘానికి, ప్రజలందరికీ ప్రేమ, శాంతి, సహనానికి మార్గం చూపిన యేసుక్రీస్తు బోధనలు మన జీవితాల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం అన్నారు.
ఈ ప్రత్యేక రోజున, మానవత్వం, క్షమ, సేవా భావనలను మనం హృదయపూర్వకంగా ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ, సమాజంలో ప్రేమ, ఐక్యత, శాంతి పరిరక్షించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం అని, ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రీస్తు బోధనలు చేస్తున్న దైవజేనులు రేవ. దానియేలు నాగీశెట్టి

ఈస్టర్ సంబరాలలో పాల్గొన్న సంఘ సభ్యులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!