06-04-2026 NORMAL NEWS 04:01 PM
swarnodayam.com
Telugu Daily News
06-04-2026 04:01 PM By Mandala Yadagiri

అక్రమ గ్రానైట్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీపీఐ ఫిర్యాదు.

అక్రమ గ్రానైట్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీపీఐ ఫిర్యాదు.
Oplus_16908288

మండలంలో మైనింగ్ దందాకు సూత్రధారులు ఎవరు

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): సైదాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ధనార్జననే ద్వేయంగ నిర్వహిస్తున్న కొంతమంది గ్రానైట్ వ్యాపార యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసారు.

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్న సిపిఐ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్ మాట్లాడుతూ
సైదాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నటువంటి పలు గ్రానైట్ క్వారీల పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమ గ్రానైట్ వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించేటువంటి పన్నులను చెల్లించకుండా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ అధికారుల అండదండలతో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో బ్లాస్టింగ్లతో గ్రానైట్ బ్లాకులను తరలించుకోవడం జరుగుతున్నదన్నారు.
అదేవిధంగా రోడ్డు భవనాలకు శాఖకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కి అధిక మోతాదులో గ్రానైట్ బ్లాకులను తరలిస్తూ ప్రజా రవాణాకు అనుకూలమైనటువంటి రోడ్లకు నష్టం వాటిల్లే విధంగా చేస్తున్న వీరిపై ప్రభుత్వము ఉక్కు పాదం మోపాలని,
ఈ యొక్క గ్రానైట్ క్వారీలు ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ లోతు గాని విస్తీర్ణంలో గాని తీయడం జరుగుతున్నదని తక్షణమే జిల్లా కలెక్టర్ గాని మైనింగ్ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం గాని కఠిన చర్యలు తీసుకోకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోయి వన్యప్రాణులు అంతమైపోతాయన్నారు. అదేవిధంగా రైతుల పంట దుమ్ము ధూళితోనిండి నీరు అడుగంటి పోయి దిగుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై లారీ గ్రానైట్ బ్లాకులు తరలిస్తున్న సమయంలో లారీ డ్రైవర్లు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇలా చేయడం ద్వారా అనేక ప్రమాదాలకు తావిస్తుందని అంతేకాకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఇలా అక్రమ మైనింగ్ మాఫీయా నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుంటే మండల వ్యాప్తంగా ధర్నా రాస్తారోకోలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!