Social 1080×1350 • Multi-page
06-04-2026 BREAKING NEWS 09:23 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని బిఆర్ఎస్ మహిళా నేత ప్రభావతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన బిఆర్ఎస్ మహిళలు.

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని బిఆర్ఎస్ మహిళా నేత ప్రభావతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన బిఆర్ఎస్ మహిళలు.
IMG_20260406_211844

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా 30వ వార్డ్ బిఆర్ఎస్ మహిళా విభాగం నేత పూసల ప్రభావతి రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమే ప్రభుత్వ మొండివైఖరి విధానాలను విమర్శించారు. ప్రజల కోసం డంపింగ్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలన్నారు. కాగా బిఆర్ఎస్ మహిళా విభాగం నేతలు చేస్తున్న నిరసన దీక్షకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు హుజురాబాద్ తాసిల్దార్ జక్కని నరేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళా విభాగం నేతలు పూసల ప్రభావతిరెడ్డి, శారద తదితర మహిళలు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి దీక్ష వద్దకు చేరుకుంటున్న మహిళా నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి..

నిరసన దీక్ష శిబిరం వద్ద ప్రజలనుదేశించి మాట్లాడుతున్న 30వ వార్డు బిఆర్ఎస్ మహిళా నేత పూసల ప్రభావతిరెడ్డి..

డంపింగ్ యార్డ్ రద్దుచేయాలని కోరుతూ తాసిల్దార్ నరేందర్ కు వినతిపత్రం అందజేస్తున్న ప్రభావతిరెడ్డి, శారద తదితర మహిళా నేతలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!