Social 1080×1350 • Multi-page
07-04-2026 BREAKING NEWS 09:33 PM
swarnodayam.com
Telugu Daily News

ఉత్తమ ప్రతిభకు 108 సిబ్బందికి పురస్కారాలు

ఉత్తమ ప్రతిభకు 108 సిబ్బందికి పురస్కారాలు
IMG-20260407-WA1420

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవoను పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖలోని 108లో పనిచేసే ఇద్దరికీ ఉత్తమ ప్రతిభకు పురస్కారాలను లభించాయి. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో మంగళవారం హుజురాబాద్ 108 లో ఉత్తమ ఈఎన్టి గా రొంటాల సురేష్ కుమార్, ఉత్తమ పైలట్ గా సుంకరి అశోక్ రెడ్డి లకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. వీరికి డిప్యూటి సియం, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టియాన జడ్చాంగ్ హెల్త్ , ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీతలు అందించారు. వీరికి అవార్డు రావడం పట్ల ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ భూమా నాగేందర్, జిల్లా ఈఎంఈ సయ్యద్ ఇమ్రాన్ లు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!