Social 1080×1350 • Multi-page
08-04-2026 BREAKING NEWS 04:50 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీశ్రీశ్రీ గిద్ద పెరుమాండ్ల మహా హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి… – సమితి అధ్యక్షుడు, బస్తీ ప్రముఖులు, కమిటీ సభ్యులు

శ్రీశ్రీశ్రీ గిద్ద పెరుమాండ్ల మహా హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి… – సమితి అధ్యక్షుడు, బస్తీ ప్రముఖులు, కమిటీ సభ్యులు
IMG-20260408-WA0113

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఈనెల 17న బుదవారం కరీంనగర్లోని గిద్దె పెరుమాండ్ల దేవాలయ మైదానంలో నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ గిద్ద పెరుమాండ్ల మహా హిందూ సమ్మేళనంను హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనీ విజయవంతం చేయాలనీ శ్రీ గిద్ద పెరుమండ్ల దేవాలయంలో గోడ పత్రిక కరపత్రంలు సమితి అధ్యక్షుడు, బస్తీ ప్రముఖులు, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బస్తీ ప్రముఖులు, కమిటీ సభ్యులు బుధవారం ఆవిష్కరించారు. అంతకు ముందు ఆలయ పూజారి గిద్దె పెరుమాండ్లస్వామి పాదాల చెంత గోడ ప్రతులు, కరపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నరసింహరెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ గిద్ద పెరుమాండ్ల మహా హిందూ సమ్మేళనానికి శ్రీ రాంపూర్ బస్తీ పరిధిలోని కోతి రాంపూర్, కట్టరాంపూర్, పోచమ్మ వాడ, అల్కాపూర్ కాలనీ నుండి అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హిందువులు ఐక్యంగా ఉండి సనాతన ధర్మాన్ని కాపడుకోవాలన్నారు. నేడు దేశంలో కులాల పేరుతో హిందువులు విభజించబడుతున్నారని తెలిపారు. కులాలు వేరైనా హిందువులంతా ఒకటే అనే భావం ప్రతి హిందువులోనే రావాలన్నారు. జాతీయ భావం దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. దేశం బాగుంటేనే హిందువులంతా తమ సాంప్రదాయాలను సంస్కృతులను కాపాడుకోగలుగుతారన్నారు. దేశంలో జరుగుతున్న విదేశీ కుట్రలను గుర్తించి హిందువులు వాటిని ఎదుర్కొనేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. హిందూ సమ్మేళనం ద్వారా హిందువుల ఐక్యత, హిందువులు అంత ఒకటే ఒకరికొకరు అండగా ఉందామనే భావనతో నిర్వహించే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరారు.

గోడ పత్రిక, కరపత్రంలు ఆవిష్కరిస్తున్న సమితి అధ్యక్షుడు, బస్తీ ప్రముఖులు, కమిటీ సభ్యులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!