Social 1080×1350 • Multi-page
08-04-2026 BREAKING NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News

అలరించిన ఈసీఈ విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

అలరించిన ఈసీఈ విద్యార్థుల వీడ్కోలు సమావేశం.
IMG_20260408_184423

– చేతికందిన అవకాశాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలి.. ప్రిన్సిపల్ డాక్టర్ కె శంకర్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యార్థులు చేతికందిన అవకాశాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే శంకర్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో “సంస్మరణం 26 ఏ జాయ్ ఆఫ్ మెమోరీస్” అనే పేరుతో నాలుగవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలికారు.

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తో ఇటు సాఫ్ట్వేర్ కు హార్డ్వేర్ ఉద్యోగాలకు రెండింటికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థికి ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండడం వలన సులభముగా విజయాలు సాధిస్తాడని అన్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు కోడింగ్ స్కిల్స్ ను ఈసీఈ విద్యార్థులు నేర్చుకోవాలని అన్నారు. కళాశాల విద్యార్థులకు ఎల్లప్పుడూ కావలసిన అవసరాలను తీర్చిందని అన్నారు. కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు కళాశాలతో ఎప్పటికీ సంబంధం కలిగి ఉండాలని అన్నారు. ఈసీఈ విభాగ అధిపతి డాక్టర్ బి .రమేష్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ ఉత్సవాలు మంచి జ్ఞాపకాలను బిగిస్తాయని పేర్కొన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లతో మంచి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు తమకు తెలిసిన ఉపాధి అవకాశాలను ఇతరులకు అందజేయాలన్నారు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ సంబంధించిన పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని సూచించారు. కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరియు అధ్యాపకురాలు డాక్టర్ ఎన్ శశికళ మాట్లాడుతూ విజయం సాధించేందుకు తగినంత పరిశ్రమ చేయవలసి ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు కళాశాల మరియు సమాజము అందజేసిన సహాయ సహకారాలు తగిన ఫలాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సంస్మరణం 26 కార్యక్రమ సమన్వయకర్త అధ్యాపకురాలు గౌరీ పుండలిక్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగ, మూడవ సంవత్సర విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కాక విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురినీ అలరించాయి.

మాట్లాడుతున్న కిట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే శంకర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!