Social 1080×1350 • Multi-page
08-04-2026 BREAKING NEWS 07:17 PM
swarnodayam.com
Telugu Daily News

డంప్ యార్డ్ సమస్యపై కలెక్టర్ తో చర్చించి, వినతి పత్రం అందజేసిన వొడితల ప్రణవ్.

డంప్ యార్డ్ సమస్యపై కలెక్టర్ తో చర్చించి, వినతి పత్రం అందజేసిన వొడితల ప్రణవ్.
IMG-20260408-WA0137

–ఇప్పటికే మంత్రులతో, మున్సిపల్ శాఖ అధికారులతో ఈ విషయంపై పలుమార్లు చర్చించిన ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణ శివారులోనీ సిర్సపల్లి ప్రాంతంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పై, జీవన ప్రమాణాలకు దూరంగా ఉండాలని, దాన్ని తరలించే విషయంపై హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో సుదీర్ఘంగా చర్చించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డంపింగ్ యార్డు వల్ల కలిగే నష్టాలను, పంటలకు తలెత్తే ఇబ్బందులను, రైతులకు కలిగే నష్టాలను, జనావాసాలకు దూరంగా ఉండాలని తెలిపారు. దీనిపై ఇప్పటికే మంత్రులను, మున్సిపల్ శాఖ అధికారులను కలిసి పూర్తి వివరాలు అందజేశామని, దీనిపై మరోసారి అధికారులతో చర్చించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు పూర్తి నివేదిక తీసుకుంటానని తెలిపారు.

జిల్లా కలెక్టర్కు డంపింగ్ యార్డ్ పై వివరించి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!