Social 1080×1350 • Multi-page
08-04-2026 BREAKING NEWS 07:59 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దుకు నిరసన దీక్ష చేపట్టిన రిటైర్డ్ ఉద్యోగులు

డంపింగ్ యార్డ్ రద్దుకు నిరసన దీక్ష చేపట్టిన రిటైర్డ్ ఉద్యోగులు
IMG-20260408-WA0164

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉరితాడుగా మారనున్న డంపింగ్ యార్డ్ ఏర్పార్టును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం రిటైర్డ్ ఉద్యోగులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ రోజు నిరసన దీక్షలో వారు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలి తప్ప ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లుతున్న మొండిగా నష్టం కలిగించే ప్రాజెక్టులను ప్రజల మీద రుద్దడం ఏమిటని అన్నారు. ప్రభుత్వం పునరా లోచన చేసి వాయు జల శబ్ద కాలుష్యానికి కారకమైన డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రద్దు చేసేంతవరకు రిటైర్డ్ ఉద్యోగులు నల్ల రిబ్బన్లను ధరించి తమ నిరసనను తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి ఉస్మాన్ పాషా, నాయకులు గంజి జవర్ధన్, రవిశంకర్ శుక్ల, కొన్ని రాజిరెడ్డి, సొల్లు సారయ్య, బుర్ర ఆగయ్య, శివారెడ్డి, అఖిలపక్ష నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, గుడిపాటి జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిరసన దీక్షలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!