Social 1080×1350 • Multi-page
09-04-2026 BREAKING NEWS 07:52 PM
swarnodayam.com
Telugu Daily News

ప్లాస్టిక్ రహిత హుజురాబాద్ కోసం కృషి చేయాలి. – మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసినీ

ప్లాస్టిక్ రహిత హుజురాబాద్ కోసం కృషి చేయాలి. – మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసినీ
IMG_20260409_194253

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్లాస్టిక్ రహిత హుజురాబాద్ గా తయారు కావడానికి అందరూ కృషి చేయాలని
హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసినీ అన్నారు. గురువారం హుజురాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో పట్టణములోని వర్తక వాణిజ్య వ్యాపారులు, ఫంక్షన్ హాలు యజమానులతో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సమావేశo జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వ నిబంధనల ప్రకారం హుజురాబాద్ పురపాలక సంఘము పరిధిలో 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను అమ్మడం గానీ వినియోగించడం గానీ చేయరాదని చెప్పారు.
ప్లాస్టిక్ వినియోగం వలన అనేక అనర్థాలు ఉన్నాయన్నారు. పట్టణ పరిధిలో గల ప్రతి ఫంక్షన్ హాలు వారు ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించరాదని వారి ఫంక్షన్ హాలు ముందు తప్పని సరిగా ప్లాస్టిక్ నిషేధంపై బ్యానర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈనెల 26 నుండి పట్టణంలో ప్లాస్టిక్ నివారణ కోసం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లయితే వారికి రూ. 5,000/-ల నుండి రూ. 25,000/-ల వరకు జరిమానా విధించబడునని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి. వినయ్, సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్, సానిటరీ జవాన్లు ఆర్ సుధీర్, పి రాజు, పి అనిల్, టి కుమారస్వామి, ఏ రమేష్ , ఇతర వర్తక వాణిజ్య వ్యాపారులు పాల్గొన్నారు.

ప్లాస్టికు వ్యతిరేక బ్యానర్ ను ఆవిష్కరిస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసినీ, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్

హాజరైన పట్టణములోని వర్తక, వాణిజ్య వ్యాపారులు, ఫంక్షన్ హాలు యజమానులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!