Social 1080×1350 • Multi-page
09-04-2026 BREAKING NEWS 09:43 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలనీ బీఎస్పీ నిరసన దీక్ష

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలనీ బీఎస్పీ నిరసన దీక్ష
IMG-20260409-WA0107

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ శివారులోని సిర్సపల్లి లో నెలకొల్పనున్న డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. గురువారం అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు 18వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా
బిఎస్పీ జోన్ ఇంచార్జ్ పల్లె ప్రశాంత్ మాట్లాడుతూ …
హుజురాబాద్ ప్రాంత ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యాన్ని కానుకగా ఇచ్చి ప్రజా జీవితాన్ని, పాడి పంటలను, ప్రకృతి సమతుల్యతను నాశనం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని రద్దు చేయని పక్షంలో జరిగే తీవ్ర పరిణామాలకు, ప్రజా ఆందోళనలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తామని తెలపడం, ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ ప్లాంట్ రద్దు చేసే వారికి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానని ముందుకు రావడం,
కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్లాంట్ రద్దు చేస్తా అని పేర్కొనడం, కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ చైర్మన్, సభ్యులు అందరూ ప్లాంట్ రద్దుకై తీర్మానం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఏప్రిల్ 14 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుక ప్లాంటు రద్దు చేయని పక్షంలో బీఎస్పీ పార్టీ భారీ పోరాటo చేస్తుందన్నారు.
—న్యాయవాదుల సంఘీభావం
డంపింగ్ యార్డ్ రద్దు కోసం 18వ రోజు జరుగుతున్న నిరసన దీక్షకు న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. కోర్టు నుండి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు న్యాయవాదులు ర్యాలీగా వచ్చి నిరసన శిబిరం వద్ద బీఎస్పీ నాయకులకు మద్దతుగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అధ్యక్షులు మంద సమ్మయ్య,
బీఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ దొడ్డె సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గిన్నారపు మహేందర్, అసెంబ్లీ ఇంచార్జ్ లు అంబాల ప్రభు, వేల్పుల మల్లేశం, నాయకులు మారెపల్లి మొగిలయ్య, గరిగే చంద్రయ్య, కండె తిరుపతి, రామ్ శ్రీనివాస్, అచ్యుత్, మల్లయ్యయాదవ్, మంద జగన్, అఖిల పక్ష జేఏసీ నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, చందుపట్ల జనార్ధన్, వేల్పుల ప్రభాకర్, సందెల వెంకన్న, హాన్మంతరావు, తునికి రవి, తునికి సమ్మయ్య, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ నేతల దీక్షకు మద్దతు తెలిపిన న్యాయవాదులు..

మాట్లాడుతున్న బిఎస్పీ జోన్ ఇంచార్జ్ పల్లె ప్రశాంత్

డంపింగ్ యార్డు రద్దు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న బిఎస్పి నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!