Social 1080×1350 • Multi-page
10-04-2026 BREAKING NEWS 11:41 AM
swarnodayam.com
Telugu Daily News

సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చాలని మానస దేవి టెంపుల్ లో ముడుపు కట్టిన సిర్సపల్లి వాసులు

సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చాలని మానస దేవి టెంపుల్ లో ముడుపు కట్టిన సిర్సపల్లి వాసులు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సిరసపల్లి గ్రామాల సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చి దానిని రద్దు చేసేలా చూడాలని జిల్లాలోని ప్రసిద్ధి చెందిన మానస దేవి ఆలయంలో సిరిసపల్లి గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శనం చేసుకొని ముడుపు కట్టారని వారు తెలిపారు. గత మూడు వారాలుగా పట్టణంలో వేస్ట్ కు ఎనర్జీ ప్రాజెక్టు రద్దు చేయాలని ఆందోళనలు చేపడుతున్న క్రమంలో సిరిసపల్లి గ్రామస్తులు పలువురు మంత్రులు అధికారులకు విన్నవించిన సీఎం తలచుకుంటే తప్ప దానిని రద్దు చేసే అధికారం లేదని గ్రహించి సీఎం రేవంత్ మనసు మార్చి డంపింగ్ యార్డ్ రద్దు చేసేలా చేయాలని మానసా దేవి అమ్మవారినీ వేడుకుని ముకుమ్మడిగా ముడుపు కట్టినట్లు వారి తెలిపారు. మానసా దేవి ఆలయంలో ముడుపు కట్టినట్లయితే కోరిన కోరికలు తీరుతాయని రాష్ట్రంలోనే ప్రసిద్ధి. ఆ విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి మనసు మారేలా చూడాలని ముడుపు చెల్లించడం పలువురిని ఆలోచింపజేస్తుంది. ఆలయాన్ని దర్శించి ముడుపు చెల్లించిన వారిలో సిరసపల్లి సర్పంచ్ పోల్సాని రామారావు, ఉపసర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ లక్ష్మాజీ, రామారావు, సంజీవరెడ్డి, బిక్షపతి, లింగారెడ్డి, తిరుపతిరావు, లింగారావు, రవీందర్ రావు, ప్రకాష్ రావు, మల్లారావు, మాధవరావు తదితరులున్నారు.

డంపింగ్ యార్డ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చాలని మానస దేవి ఆలయంలో ముడుపు కడుతున్న సిరిసపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!