Social 1080×1350 • Multi-page
10-04-2026 BREAKING NEWS 04:33 PM
swarnodayam.com
Telugu Daily News

రైతుల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో సమరభేరి.. – రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి.

రైతుల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో సమరభేరి.. – రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి.
IMG-20260410-WA0108

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్నదాతల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో ఈనెల 28 న కరీంనగర్ లో రైతు మహాగర్జన సమరభేరి సమర భేరి సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. శుక్రవారం హైదారాబాద్ లోని హిమాయత్ నగర్లో రాష్ట్ర ప్రజా సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమరభేరి సభ విజయవంతం చేయడానికి ఏర్పాట్లపై వివిధ జిల్లాల బాద్యులతో సమీక్షించారు.
అంతకు ముందు మెదక్ ఎంపీ రఘునందన్ రావును నగరంలో వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రంను అందజేసి సమరభేరి సభకు మద్దతు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించి గర్జన గోడ ప్రతులను ఎంపీ రఘునందన్ రావు ఆవిష్కరించారు.

పాలకులు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఋణ మాఫీ 30 శాతం మంది రైతులకే జరిగిందని మిగతా 70 శాతం మందికి వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారుకౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓసి కార్పొరేషన్లకు పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకలకే పరిమితం చేయడం సరి కాదన్నారు. ఓ పరిశ్రమ యజమాని తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయిస్తున్నాడని అదే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతుల న్యాయమైన డిమాండ్లను ఇతర సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈనెల 28న ఓసి ఐకాస ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. సమావేశంలో రైతు ప్రజా సంఘాల జాతీయ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రథాన కార్యదర్శి శ్రీహరిరావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!