Social 1080×1350 • Multi-page
10-04-2026 BREAKING NEWS 05:10 PM
swarnodayam.com
Telugu Daily News

కేజీ బీవీ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

కేజీ బీవీ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (కేశవపట్నం)హుజురాబాద్ ఏప్రిల్ 10:


కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో ప్రవేశాల కోసము దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ (ఎస్ ఓ)వడ్నాల మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
(కేజీబీవీ), ఇంటర్ ప్రధమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ప్రవేశం పొందగోరేవారు నేరుగా కళాశాలలో సంప్రదించి ప్రవేశం పొందవచ్చు అని తెలిపారు.

*ఆరవ తరగతిలో ప్రవేశము పొందగోరు విద్యార్థులు,
ఇంటర్ ప్రథమ సంవత్సరము *బైపిసి గ్రూపులో ప్రవేశం పొందే వారికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రవేశాల కొరకు ఏప్రిల్ 15వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 5వ తారీఖు రోజున జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15వ తారీకు లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు.
ఆరవ తరగతిలో ప్రవేశం పొందుగూరు విద్యార్థులు, ఇంటర్మీడియట్, బైపిసీ గ్రూపులో ప్రవేశం పొందడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ (http//tgrjc.cgg.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత అదనపు సమాచారం కోసం కేజీబీవీ కేశవపట్నం (శంకరపట్నం) బాలికల విద్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

స్పెషల్ ఆఫీసర్ (ఎస్ ఓ)వడ్నాల మాధవి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!