Social 1080×1350 • Multi-page
11-04-2026 BREAKING NEWS 06:04 PM
swarnodayam.com
Telugu Daily News

బహు జన చైతన్య స్ఫూర్తి.. – మహిళల విద్యా దీప స్తంభం.. – జ్యోతిరావు పూలే. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

బహు జన చైతన్య స్ఫూర్తి.. – మహిళల విద్యా దీప స్తంభం.. – జ్యోతిరావు పూలే. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260411_175952

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఆధునిక యుగంలో కుల వివక్ష నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు సత్య శోధక సమాజ వ్యవస్థాపకుడు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆజరామరుడు అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటుబడిన దీన జన సమ సమాజ స్థాపనలో భావి తరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్యా విద్యా హక్కు కోసం సమానత్వం కోసం పాటు పడిన మహాత్మా జ్యోతిరావు పూలే అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.

పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రామారావు

శనివారం నగరంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పోలాడి రామారావు మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో సమానత్వానికి విద్యకు పునాది వేసిన మహానుభావుల్లో జ్యోతిరావు పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి పోతుందని అన్నారు.
ఆరోజుల్లో మహిళలు చదవడం పాపంగా భావించిన పరిస్థితుల్లో పూలే సమాజాన్ని సవాల్ చేస్తూ మహిళల విద్యకు శ్రీకారం చుట్టారని, ఆయన చూపిన దారి కేవలం విద్యకు మాత్రమే దారి కాదని మహిళల స్వాభిమానం స్వేచ్ఛ మరియు గౌరవానికి మార్గదర్శకం అయిందని అన్నారు. ఒక మహిళ చదువుకుంటే అది ఒక కుటుంబానికి మాత్రమే కాదు మొత్తం సమాజాన్ని మార్చగలదని పూలే నమ్మారని అది నేడు కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని పోలాడి రామారావు పేర్కొన్నారు.
ఈ నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టేందుకు మొదట తన భార్య సావిత్రిభాయి పూలేని చదివించి భారత దేశపు మొదటి ఉపాధ్యాయురాలిగా నిలబెట్టరన్నారు. ఇది సాధారణ విషయం కాదనీ, అదొక విప్లవం సమాజం వ్యతిరేకించినా అవమానాలు ఎదురైనా పూలే దంపతులు వెనక్కి తగ్గలేదన్నారు. బాలికల కోసం మోదటి పాఠశాలను స్థాపించి విద్య అనే హక్కును వారికి కల్పించారన్నారు. ఈ విప్లవ ఆలోచనలు తర్వాతి తరాలకు మార్గదర్శనంగా మారగా ముఖ్యంగా బీఆర్ అంబేద్కర్, పూలే సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని భారత రాజ్యాంగంలోని మహిళలకు సమాన హక్కులు కల్పించారన్నారు.
రాజ్యాంగంలోని వివిధ అధికరణాలు మహిళల గౌరవం స్వేచ్ఛ అవకాశాలను రక్షించేలా రూపొందించ బడ్డాయన్నారు. ఈ రోజు మన దేశంలో చదువు కుంటున్న ప్రతి మహిళ వెనుక పూలే త్యాగ ధృఢ సంకల్పం సమాజ మార్పు కోసం చేసిన పోరాటం నిలిచి ఉందన్నారు. ఒకప్పుడు పాఠశాలలకు వెళ్ళలేని అమ్మాయిలు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాద్యాయులు నాయకులవుతున్నారని అంటే అది పూలే దంపతుల కృషి ఫలితం, పూలే చూపిన మార్గం అని, మన సమాజాన్ని నిజమైన సమానత్వం వైపు తీసుకెళ్ళుతుందని పోలాడి రామారావు నివాళులు అర్పించారు. ముందుగా తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జాగృతి కార్యాలయంలో నిర్వహించిన జ్యోతీరావు పూలే జయంతి కార్యక్రమంలో పోలాడి రామారావు పాల్గొని పూలేకు నివాలు అర్పించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమరభేరి సభకు ప్రత్యేక ప్రథాన వక్తగా హాజారు కాగలరని కల్వకుంట్ల కవితకు మరో మారు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని పోలాడి రామారావు తెలిపారు.

మాట్లాడుతున్న జాగృతి అధ్యక్షురాలు కవిత.. పక్కన పోలాడి రామారావు..

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!