Social 1080×1350 • Multi-page
12-04-2026 BREAKING NEWS 09:31 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజల ఆరోగ్యమే మోడీ ప్రభుత్వ లక్షం.. – మట్ట పవన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు

ప్రజల ఆరోగ్యమే మోడీ ప్రభుత్వ లక్షం.. – మట్ట పవన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు
IMG-20260412-WA0045

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ ప్రజల ఆరోగ్యం కాపాడడమే నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం అని బిజెపి సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి అన్నారు.
వేసవికాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ముందస్తుగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మట్ట పవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ,సమయానుకూలంగా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్న నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి అవసరం అని అన్నారు. పేద మరియు మధ్య తరగతి కుటుంబాల కష్టాలను అర్థం చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం నిజమైన ప్రజా పాలనకు నిదర్శనమని, సాధారణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా వేసవికాలంలో ధరల భారంతో ఇబ్బందులు పడే ప్రజలకు మూడు నెలల బియ్యం ఒకేసారి అందించడం గొప్ప ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం నరేంద్ర మోడీ దూరదృష్టికి నిదర్శనమని పవన్ రెడ్డి కితాబిచ్చాడు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేసుకోవాలని పవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!