Social 1080×1350 • Multi-page
12-04-2026 BREAKING NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ముస్లింల ర్యాలీ, నిరసన దీక్ష

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ముస్లింల ర్యాలీ, నిరసన దీక్ష
IMG-20260412-WA0109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని సిరిసపల్లి గణేష్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ హుజురాబాద్ పట్టణంలోని ముస్లింలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేశారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ రోజు నిరసన దీక్షలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు ద్వారా కాలుష్యం తో జీవరరాశులు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి పస్తుందని నీరు గాలి కాలశ్యమై అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఎండి కరీం ఎండి గఫార్, ఎండి ఇమ్రాన్, తౌసిఫ్, ఖలీద్, ఫయాజ్, ఆఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, గుడిపాటి జయపాల్ రెడ్డి, బండ శ్రీనివాస్, ఎడవల్లి కొండల్ రెడ్డి, వెంకట్రావు, విజయ్, సమ్మయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!