Social 1080×1350 • Multi-page
13-04-2026 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావుకు నేతల ఘన నివాళి.

మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావుకు నేతల ఘన నివాళి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈరోజు హుజురాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించారు. మంథని శాసనసభ్యుడిగా, శాసనసభ స్పీకర్ గా ఉమ్మడి రాష్ట్రంలో శ్రీపాదరావు అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, హుజురాబాద్ మున్సిపాలిటీ చెర్ పర్సన్ రోంటాల సుహాసిని, మహిళ మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి, హుజురాబాద్ 5వ వార్డు కౌన్సిలర్ సొల్లు సునిత, 19వ వార్డు కౌన్సిలర్ గొస్కుల రాజ్ కుమార్, 24వ వార్డు కౌన్సిలర్ నాంపెల్లి శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ వజ్జెపల్లి వెంకటేష్ ,9వ వార్డు కౌన్సిలర్ ఇమ్మడి సమ్మయ్య, 28వ వార్డు కౌన్సిలర్ తాళ్ పెళ్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ లంకదాసరి లావణ్య , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ హనుమాన్ టెంపుల్ మాజీ చెర్మెన్ కొలిపాక శంకర్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి సదానందం, పంజాల రాంశంకర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యాక్షురాలు గొస్కుల నాగమణి, యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ మేకల రాజ్ కుమార్, సిర్సపెల్లి గ్రామశాఖ అధ్యక్షులు ఆడెపు ఐలయ్య,యండి అలీమ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుశీల, కొయల్కార్ బాలాజీ, లంకదాసరి ప్రవీణ్, జుపాక సంపత్, రావుల వెంకట్, సునిత, కల్పన, రాదక్క, యండి రియాజ్, యండి కరీమా తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!