Social 1080×1350 • Multi-page
13-04-2026 BREAKING NEWS 11:32 PM
swarnodayam.com
Telugu Daily News

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచి… – బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచి… – బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.
IMG-20260413-WA0411

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకర్తగా రూపొందించిన రాజ్యాంగo దేశానికి దిక్సూచి అయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 135వ ఉత్సవాలను పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు హుజురాబాద్ లో అంబేద్కర్ విగ్రహా శుద్ధి చేపట్టి, విగ్రహం వద్ద దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.

భారత దేశాన్ని లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యాంగ తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యచరణ మహోన్నతమైనదన్నారు. ముఖ్యంగా ప్రతి దేశానికి దానికి చట్టాలను రూపొందించిన నాయకులు ఉంటారు కానీ ఆ చట్టాలకు ఎవరు అర్హులు అనే భావనకి రూపమిచ్చిన నాయకులు తక్కువ ఉంటారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి నాయకుల్లో ఒకరిని అన్నారు. సాధారణమైన వ్యక్తిగత కష్టాలను ఎదురుకొని అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్త అయ్యారన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ తన జీవితమంతా సమానత్వంతో కూడిన చట్టపరమైన, నైతిక నిర్మాణాన్ని నిర్మించడంలో గడిపారని తెలిపారు. అంబేద్కర్ దర్శనికత మూలంగానే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. బాబా సాహెబ్ చూపిన మార్గంలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఆ దిశలోనేబిసబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వేడుకలు కేవలం ఒక స్మరణ పండుగ మాత్రమే కాదని, ఇది దేశానికి ఒక మైలురాయి లాంటిదన్నారు.

అలాగే ఉదయం అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విగ్రహాన్ని నీళ్లతో పాలతో శుద్ధి చేసి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, నాయకులు గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, పైళ్ళ వెంకట్రెడ్డి, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, గంట సంపత్, యాంసాని శశిధర్, సబ్బని రమేష్, బోరగాల సారయ్య, కౌన్సిలర్లు పంజాల మనోజ్, తూర్పాటి లక్ష్మీదుర్గ, పడారీ సుమలత, బోడిగే రాధ సుమన్, మంచికట్ల మురళి, కురిమిల్ల శ్రీధర్, ఇల్లందుల ప్రణీత్, కొలిపాక శ్రీనివాస్, కొలుగూరి అనిల్, శిరీష కొలిపాక వెంకటేష్, ఎర్ర శ్రీదర్, గొట్టే రవీందర్, గుర్రం సంతోష్, కోడిమ్యాల పవన్, యాట రాజేష్, రాపాక రాజు, అయిత సందీప్, క్యాస వెంకటేష్, నీలం రవీందర్, డోరి ఐలయ్య, తిప్పపతిని రాజేందర్, మొలుగూరీ నాగేష్, మోతే మోహన్, తూర్పాటి రామచంద్రం, మహారాజ రాజు, అక్కినేపల్లి రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!